ఒక్క అవుట్ మ్యాచ్‌ను తిప్పేసింది

ఒక్క అవుట్ మ్యాచ్‌ను తిప్పేసింది

Updated On : May 12, 2019 / 6:32 PM IST

హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో పలుసార్లు మ్యాచ్ తిరిగింది. ఓపెనర్‌గా దిగిన షేన్ వాట్సన్ చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉండడంతో సమయం దొరికినప్పుడల్లా చెన్నై సూపర్ కింగ్స్‌ను టార్గెట్ అంచుల వరకూ తీసుకురాగలిగాడు. 

చెన్నై ఇన్నింగ్స్‌లో మంచి ఫినిషర్‌గా పేరొందిన వాట్సన్(80; 59బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సులు)తో జట్టుకు హైస్కోరర్‌గా నిలవడమే కాక, గేమ్ గతిని మార్చేశాడు. దాదాపు మ్యాచ్ ముంబై చేజారినట్లే అనుకుంటున్న తరుణంలో మలింగ అద్భుతం చేశాడు. అప్పటికే బుమ్రా బౌలింగ్‌లో 16.1వ బంతిని బౌండరీ కోసం యత్నించిన వాట్సన్ భారీ షాట్ బాదాడు. 

అది కాస్తా రాహుల్ చాహర్ చేతికి చిక్కినట్లే చిక్కి చేజారింది. కానీ, మలింగ వేసిన 19.4వ బంతికి వాట్సన్ కృనాల్ పాండ్యా, డికాక్ చేతుల మీదుగా రనౌట్ అయ్యాడు. దీంతో చెన్నై విజయం కాస్తా ఆవిరైపోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఠాకూర్ కూడా రనౌట్ అవడంతో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నైపై విజయం సాధించింది.