Shikhar Dhawan: మహిళా క్రికెటర్‌తో శిఖర్ ధావన్ పెళ్లి?
భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత.. అతని పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

Dhawan 1
Shikhar Dhawan: భారత జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత.. అతని పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా ధావన్ ఓ మహిళా క్రికెటర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఓ మహిళా క్రికెటర్‌తో కొంతకాలంగా స్నేహంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటారని రూమర్లు పుట్టించారా? అనేది ఇంకా తెలియలేదు. ధావన్ కానీ, మహిళా క్రికెటర్ కానీ, ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు.
శిఖర్ ధావన్‌కు ఇదివరకే అయేషా ముఖర్జీతో ఓ కొడుకు ఉండగా.. కొడుకు జోరావర్‌తో తరచుగా ధావన్ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. ధావన్-అయేషాకు పుట్టిన జోరావర్‌కు ఏడేళ్లు కాగా.. ఇటీవలే ధావన్ తన కుమారుడు జోరావర్‌తో వీడియోకాల్‌లో యుఎఈ నుంచి మాట్లాడిన ఫోటోను కూడా ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫోటోను పంచుకున్నారు. ఇందులో తండ్రీ కొడుకులు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. ‘నా రోజులో అత్యంత ప్రత్యేక భాగం’ అంటూ ధావన్ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.

Dhawan (1)
ధావన్-అయేషా 2012లో వివాహం చేసుకోగా.. శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీకి అప్పటికే పెళ్లై విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకుని పదేళ్లు ఒంటరిగా ఉన్న అయేషా జీవితంలో అడుగుపెట్టాడు ధావన్. ఆంగ్లో ఇండియన్ అయేషా తండ్రి బెంగాళీ, తల్లి బ్రిటన్ దేశస్థురాలు. అయేషా కుటుంబం మొత్తం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది. అయేషా కూడా అక్కడే పుట్టి పెరిగింది.
శిఖర్ ధావన్ కంటే అయేషా ముఖర్జీ వయసులో పదేళ్లు పెద్దది కాగా.. ధావన్ కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా కూడా పెద్దలను కాదని వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 9ఏళ్ల కాపురం తర్వాత వారిద్దరూ విడిపోయారు.