Dhanashree verma : చాహల్ సతీమణితో శిఖర్ ధావన్ భాంగ్రా డ్యాన్స్…అదిరిపోయింది

ఇండియన్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్..ధనశ్రీ వర్మలు డ్యాన్స్ చేసిన వీడియో అభిమానులకు తెగ నచ్చేస్తోంది.

Dhanashree verma : చాహల్ సతీమణితో శిఖర్ ధావన్ భాంగ్రా డ్యాన్స్…అదిరిపోయింది

Dhavan

Updated On : March 31, 2021 / 3:45 PM IST

shraddhavan Dance : టీమిండియా స్పిన్నర్ చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ అందరికీ తెలిసిందే. ఈమె Youtuber గా ఫుల్ ఫేమస్. డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి డ్యాన్సర్ గా పేరుంది. యూ ట్యూబ్ ఛానల్ కు లక్షల సంఖ్యలో సబ్ స్ర్కైబర్లు ఉన్నారు. ఈమెతో డ్యాన్స్ చేసేందుకు పలువురు ఉత్సాహం చూపుతుంటారు. భారత్ క్రికెటర్లు పలు సాంగ్స్ కు ధన శ్రీతో కలిసి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా…ఇండియన్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్..ధనశ్రీ వర్మలు డ్యాన్స్ చేసిన వీడియో అభిమానులకు తెగ నచ్చేస్తోంది. ఈ వీడియోను ధన శ్రీ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే..లక్షల సంఖ్యలో లైక్స్, వందలాది కామెంట్స్ వస్తున్నాయి. ఇండియా – ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా చాహల్ తో ఉన్న సందర్భంలోనే ధనశ్రీ ఈ వీడియో చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ ముగియగానే..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లో చేరడానికి చాహల్ వెళ్లగా…ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లోకి వెళ్లాడు.

ఇక ధనశ్రీ వర్మ విషయానికి వస్తే..డిసెంబర్ 22వ తేదీన చాహల్ – ధనశ్రీలు వివాహం చేసుకున్నారు. అప్పుడు కరోనా టైం కావడంతో..కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. తొలుత డాక్టర్ కావాలనుకున్న ఈమె..కొరియోగ్రాఫర్ గా దూసుకపోతున్నారు. ఎనర్జీ లెవల్, ఉత్సాహం…ఫేషియల్ ఎక్స్ ప్రెషన్ సూపర్బ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9)