శ్రేయాస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇది తప్పనిసరి.. పాటించకపోయారో..

రోహిత్ శర్మ ను MCA లీగ్‌కు "ఫేస్ ఆఫ్ ది లీగ్"గా ప్రకటించారు.

శ్రేయాస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇది తప్పనిసరి.. పాటించకపోయారో..

PIC: @BCCI

Updated On : April 17, 2025 / 8:27 PM IST

ఐపీఎల్ 2025 సీజన్ ముగిశాక ఇండియన్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తారు. జూన్‌లో స్టార్ట్ అయ్యే ఇంగ్లండ్‌ టోర్నీకి వారు సన్నద్ధం అవుతారు. ఇండియా టీమ్ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే, టెస్ట్ జట్టులో చోటు దక్కని ముంబై ఆటగాళ్ల కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రముఖ వెబ్ సైట్ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ టీంకు దూరంగా ఉన్న తమ ప్లేయర్లు ముంబై టీ20 లీగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని MCA ఆదేశించింది. ఇప్పటికే అజింక్యా రహానె, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, శివం దూబే, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్‌కు ఈ విషయాన్ని MCA తెలియజేసింది. వారు ఈ లీగ్‌లో పాల్గొనడానికి అంగీకారం తెలిపారు.

“నేషనల్ టీంలో లేనివారు ముంబై టీ20 లీగ్ ఆడటం తప్పనిసరి. గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్లేయర్స్ కు ఇందులో మినహాయింపు ఉంటుంది” అని ఒక MCA అధికారి చెప్పారు.

“ముంబై టీ20 లీగ్ లో పాల్గొనే ప్రతి ప్లేయర్ కి రూ.15 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇస్తారు. అంతేగాక వేలం ద్వారా కూడా వాళ్లు సంపాదించుకునే అవకాశం ఉంది” అని ఆ అధికారి చెప్పారు. ఈ లీగ్ మే 26 నుంచి జూన్ 5 వరకు జరగుతుంది ఇందులో ఎనిమిది జట్లు పాల్గొంటాయి.

గత ఏడాదిలో వరుసగా రెండు ICC టైటిల్స్ భారత్‌కు అందించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ను MCA లీగ్‌కు “ఫేస్ ఆఫ్ ది లీగ్”గా ప్రకటించారు. అలానే, వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. మరో రెండు స్టాండ్లకు శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేర్లను పెట్టనున్నట్లు కూడా బోర్డు ప్రకటించింది.