Shreyas Iyer wins ICC Mens Player of the Month for March 2025
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు అరుదైన గౌరవం లభించింది. మార్చి 2025 గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీతో అతడు పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ సభ్యులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరుపున శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 243 పరుగులతో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
మార్చి నెలలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 79 పరుగులు, సెమీస్‌లో ఆస్ట్రేలియా పై 45 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేశాడు.
కాగా.. అయ్యర్ ఈ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి. ఫిబ్రవరి 2022లో ఈ అవార్డును అయ్యర్ సొంతం చేసుకున్నాడు. టీమ్ఇండియా ఆటగాళ్లలో బుమ్రా, గిల్ లు మాత్రమే రెండు కంటే ఎక్కువ సార్లు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును అందుకోవడం పట్ల శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ గుర్తింపు ఎంతో ప్రత్యేకమైందన్నాడు.
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్న భారత క్రికెటర్లు వీరే..
శుభ్‌మన్ గిల్ – 3 సార్లు
జస్‌ప్రీత్ బుమ్రా – 2 సార్లు
శ్రేయస్ అయ్యర్ – 2 సార్లు
రిషబ్ పంత్ – ఒక్కసారి (2021 జనవరి)
రవిచంద్రన్ అశ్విన్ – ఒక్కసారి (2021 ఫిబ్రవరి)
భువనేశ్వర్ కుమార్ – ఒక్కసారి (2021 మార్చి)
విరాట్ కోహ్లి – ఒక్కసారి (2022 అక్టోబర్)
యశస్వి జైస్వాల్ – ఒక్కసారి (2024 ఫిబ్రవరి)