Shubman Gill : విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాల రికార్డులు బ్రేక్.. టీ20ల్లో శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత..
టీ20ల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు.

Courtesy BCCI
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆదివారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 21 పరుగుల వద్ద అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు విరాట్ కోహ్లీ అధిగమించాడు.
167 ఇన్నింగ్స్‌ల్లో టీ20ల్లో కోహ్లీ 5వేల పరుగుల మైలురాయిని చేరుకోగా గిల్ కేవలం 154 ఇన్నింగ్స్‌ల్లోనే దీన్ని అందుకున్నాడు. ఇక ఈ జాబితాలో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. రాహుల్ 143 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
కేఎల్ రాహుల్ – 143 ఇన్నింగ్స్‌ల్లో
శుభ్‌మన్ గిల్ – 154 ఇన్నింగ్స్‌ల్లో
విరాట్ కోహ్లీ – 167 ఇన్నింగ్స్‌ల్లో
సురేశ్ రైనా – 173 ఇన్నింగ్స్‌ల్లో
గిల్ ఇప్పటి వరకు 154 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 5029 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 32 అర్థశతకాలు ఉన్నాయి.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాట్ టైటాన్స్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (112 నాటౌట్; 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ బాదాడు. అనంతరం సాయి సుదర్శన్ (108 నాటౌట్; 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అందుకుంది.
DC vs GT : గుజరాత్ పై ఓటమి.. పిచ్‌ను నిందించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్…