IPL 2025 playoffs scenario : ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమీకరణం.. ఒక్క స్థానం కోసం మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ.. ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే..?
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు మూడు జట్లు ఒక్క స్థానం కోసం పోటీపడుతున్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్ ఆఖరి దశకు చేరుకుంటుంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ ప్లేఆఫ్స్ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి నాలుగో స్థానం పైనే పడింది.
ఈ మిగిలిన ఒక్క స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లు పోటీపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే..
ఈ సీజన్‌లో ముంబై ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +1.156గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. లీగ్ దశలో ముంబై మరో రెండు మ్యాచ్‌లను ఢిల్లీ, పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే అప్పుడు 18 పాయింట్లతో మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
DC vs GT : గుజరాత్ పై ఓటమి.. పిచ్‌ను నిందించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్…
ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే..
ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు 16 పాయింట్లు సాధిస్తారు. కానీ ఏ జట్టును ఓడిస్తారు అన్నది ఇక్కడ కీలకాంశం. ఢిల్లీ క్యాపిట్స్‌ను ఓడిస్తే దాదాపుగా ముంబై ప్లేఆఫ్స్ స్థానం ఖరారు అయినట్లే. ఒకవేళ ఢిల్లీ చేతిలో ముంబై ఓడిపోయితే.. అప్పుడు ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.
రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే..
ఇలా కాకుండా రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఓడిపోతే ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటి ముఖం పడుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే..
ఢిల్లీ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో ఆడింది. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 13 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.260గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. కాగా.. లీగ్ దశలో ఢిల్లీ మరో రెండు మ్యాచ్‌లు ముంబై, పంజాబ్ లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిస్తే 17 పాయింట్లతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
ఒక్కమ్యాచ్‌లోనే గెలిస్తే..
ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోతే ఢిల్లీ ఎలిమినేట్ అవుతుంది. అలాకాకుండా ముంబైని ఓడించి పంజాబ్ చేతిలో ఓడిపోతే.. అప్పుడు పంజాబ్ చేతిలో ముంబై ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో లక్నో తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఢిల్లీకి 15, ముంబైకి 14, లక్నోకు 14 కంటే ఎక్కువ పాయింట్లు ఉండవు.
Rohit Sharma : వాంఖడే కార్యక్రమం అనంతరం ఓ వ్యక్తిని తిట్టిన రోహిత్ శర్మ..! వీడియో వైరల్..
రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే..
రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే ఢిల్లీ ఎలిమినేట్ అవుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే..
లక్నో జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0469గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. లీగ్ దశలో లక్నో మరో మూడు మ్యాచ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా కూడా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. లక్నో ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో ముంబైని ఢిల్లీ ఓడించాలి, పంజాబ్ చేతిలో ఓడిపోవాలి. ముంబై తమ చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అప్పుడు లక్నోకి 16 పాయింట్లు, ఢిల్లీకి 15 పాయింట్లు, ముంబైకి 14 పాయింట్లు ఉంటాయి.
ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా లక్నో ఎలిమినేట్ అవుతుంది.