Shubman Gill : రోహిత్, కోహ్లీ వన్డే భవిష్యత్తు పై శుభ్‌మన్ గిల్ కామెంట్స్.. రాబోయే కొన్ని నెలలు ఎంతో ముఖ్యం.. ఏం జరుగుతుందో చెప్పలేం..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల వన్డే భవిష్యత్తు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర కామెంట్లు చేశాడు.

Shubman Gill comments on Rohit and Virat ODI Future
Shubman Gill : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే ప్రపంచకప్ 2027 ఆడతారా? అన్న దానిపై గత కొద్ది రోజులుగా సందిగ్ధత నెలకొంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కు ఆ బాధ్యతలు అప్పగించారు. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. దీంతో ఆసీస్ పర్యటన అనంతరం వన్డేలకు రో-కో ద్వయం వీడ్కోలు చెప్పనున్నారనే వార్తలు వచ్చాయి.
అయితే.. వెస్టిండీతో రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడుతూ రోహిత్, కోహ్లీ వన్డే భవిష్యత్తు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశౄడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారని అన్నాడు. ‘వారిద్దరి భవితవ్యం పై గత కొన్నాళ్లుగా ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. వారిద్దరు ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించారు. అద్భుమైన నైపుణ్యం ఉన్నఆటగాళ్లు. జట్టుకు వారు చాలా అవసరం. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగానే వారిద్దరి సన్నద్ధత కొనసాగుతోంది.’ అని గిల్ చెప్పాడు.
Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బ్రేక్..
డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించాడని, తాను అతడినే ఫాలో అవుతానని గిల్ తెలిపాడు. మూడు ఫార్మాట్లలో కూడా తనకే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని వస్తున్న వార్తలపైనా గిల్ స్పందించాడు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్నాడు. తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే.. తాను మాత్రం వర్తమానంలోనే ఉండేందుకే ఇష్టపడతానని తెలిపాడు. గతంలోనే ఏం సాధించామనేది అప్రస్తుతం అని, ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతామని వెల్లడించాడు. రాబోయే కొన్ని నెలలు తమకు ఎంతో ముఖ్యం అని అన్నాడు.