IPL 2024 : సీఎస్కేపై విజయం తరువాత శుభ్‌మాన్ గిల్‌, టీం సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మ్యాచ్ ను గెలిచిన ఆనందంలో ఉన్న శుభ్ మాన్ గిల్ కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ..

IPL 2024 : సీఎస్కేపై విజయం తరువాత శుభ్‌మాన్ గిల్‌, టీం సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ

Shubman Gill fined

Updated On : May 11, 2024 / 1:27 PM IST

Shubman Gill : ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆసక్తికర పోరులో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 231 పరుగులు చేసింది. 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులకే సీఎస్‌కే పరాజయం పాలైంది. దీంతో అయిదో విజయంతో గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు గిల్‌, సుదర్శన్ సెంచరీలు చేశారు.

Also Read : ఓరి వీళ్ల దుంపతెగ.. క్రికెట్ ఆడుతున్నారా? చేపలు పడుతున్నారా! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మ్యాచ్ ను గెలిచిన ఆనందంలో ఉన్న శుభ్ మాన్ గిల్ కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్ కు రూ. 24 లక్షల జరిమానాను విధించింది. అలాగే జట్టులోని సభ్యులకూ మ్యాచ్ ఫీజులో 25శాతం లేదా రూ. 6లక్షల వరకు ఫైన్ వేసింది. ఏది తక్కువైతే అది జరిమానా విధించబడుతుంది. 2024 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ రెండోసారి స్లో ఓవర్ రేటుకు పాల్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది.

Also Read : MS Dhoni : మైదానంలోకి దూసుకొచ్చి రచ్చచేసిన అభిమాని.. పరుగు తీసిన ధోనీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను గిల్ సేన సజీవంగా ఉంచుకుంది. గుజరాత్ జట్టు పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. మొత్తం 12 మ్యాచ్ లు ఆడిన గిల్ సేన ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి.. ఏడు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఒకవేళ రెండు మ్యాచ్ లలో గుజరాత్ జట్టు విజయం సాధించినప్పటికీ ఇతర జట్ల గెలుపోటములు, ఆ జట్ల రన్ రేట్లపై గుజరాత్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.