Viral Video: అంతర్జాతీయ రేసులో ఎవరైనా ఇంత మెల్లిగా ఉరుకుతారా? ప్రేక్షకుల దిమ్మతిరిగిపోయింది..

ఈ అథ్లెట్ తో తాబేలుకి పరుగు పందెం పెడితే.. మనిషిపై తాబేలు గెలుస్తుందని, కొత్త కథ పుట్టుకువస్తుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Viral Video: అంతర్జాతీయ రేసులో ఎవరైనా ఇంత మెల్లిగా ఉరుకుతారా? ప్రేక్షకుల దిమ్మతిరిగిపోయింది..

Somali runner

Viral Video – Somali Sports: అంతర్జాతీయ పోటీలకు వెళ్లిన వారికి ఎంతటి సామర్థ్యం ఉంటుంది? పరుగు పందేల్లో రన్నర్లు ఎంతటి వేగంగా ఉరుకుతారు? ప్రత్యర్థులను ఓడించడానికి ఎంతగా కష్టపడిపోతారు.. అయితే, సొమిలియాకు చెందిన నస్రా అబుకర్ అలీ (Nasra Abukar Ali) అనే ఓ అథ్లెట్ మాత్రం ప్రత్యర్థులకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోవడమే కాకుండా, చిన్నపిల్లల్లా మెల్లిగా పరిగెత్తింది.

ఆమె పరిగెత్తిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే, సొమిలియాకు చెందిన ఆ అథ్లెట్ పై కాకుండా ఆమెను..అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేసిన అధికారులపై నెటిజన్లు మండిపడుతున్నారు.

చైనాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 100 మీటర్ల దూరం పరిగెత్తడానికి నస్రా ఏకంగా 21 క్షణాల సమయం తీసుకుంది. లంచం తీసుకుని నస్రా అబుకర్ అలీని సెలెక్ట్ చేశారా? మీ బంధువు కాబట్టి ఆమెను సెలెక్ట్ చేశారా? అని నెటిజన్లు ప్రశ్నించారు.

చివరకు ఆమెను సెలెక్ట్ చేసిన సొమాలియా క్రీడా అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. బంధుప్రీతి వల్లే ఈ అథ్లెట్ ను సొమాలియా క్రీడా అధికారి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రతిభ కలిగిన వారికి అవకాశం ఇవ్వకుండా పరిగెత్తడం సరిగ్గారాని మహిళను పోటీకి పంపిన ఆ అధికారి తీరుపై విచారణ జరుగుతోంది. దీంతో సొమాలియా క్రీడా మంత్రి క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇటువంటివి జరగకుండా చూసుకుంటామన్నారు.

Manoj Tiwary: క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి