ప్రపంచ కప్‌కు ధోనీ కొత్త అవతారం: దాదా

ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ముందు ధోనీ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. దీంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆసీస్, న్యూజిలాండ్ పర్యటనల అనంతరం మరోసారి తన సత్తా చాటి చెప్పడంతో క్రికెట్ విశ్లేషకులంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనీ కొత్త అవతారంలో కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ మీడియాతో మాట్లాడాడు.
‘ప్రపంచ కప్ జట్టులో ధోనీని తీసుకోవాలా.. వద్దా అనే సందేహాన్ని పటాపంచలు చేస్తూ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఒకవేళ ప్రపంచ కప్ భారత్ జట్టులో తీసుకుంటే ఓ అదనపు బలంగా ఉంటాడు. ధోనీతోపాటుగా యువ క్రికెటర్లు రిషబ్‌పంత్, విజయ్‌శంకర్ ఈ రెండు సిరీస్‌లలో చక్కటి ప్రదర్శన చేశారు. అయితే విజయ్‌శంకర్ ప్రపంచకప్ జట్టులో ఉంటాడని భావించట్లేదు. ఈ పర్యటనల్లో షమీ బౌలింగ్‌లో చాలా పరిణతి కనిపిస్తోందని’ కొనియాడాడు.
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడేసిన భారత్ విదేశీ పర్యటనలు ముగించుకుని భారత్ చేరుకుంది. ఫిబ్రవరి 24నుంచి సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న 5వన్డేలు, 2టీ20లలో ఆడనుంది.