ద్రవిడ్‌ను కలిసిన గంగూలీ, తొలి టీ20 ఢిల్లీలోనే ఆడాలి

ద్రవిడ్‌ను కలిసిన గంగూలీ, తొలి టీ20 ఢిల్లీలోనే ఆడాలి

Updated On : October 31, 2019 / 8:27 AM IST

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికైన నాటి నుంచి భారత క్రికెట్ అభిమానుల కళ్లు అతనివైపే ఉంటున్నాయి. కెప్టెన్ గా భారత క్రికెట్ లో సంచలన మార్పులు తీసుకొచ్చిన గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఏం చేస్తాడో అనే దానిపైనే చర్చలు వేడెక్కాయి. బుధవారం నేషనల్ క్రికెట్ అకాడమీ గురించి చర్చించడానికి రాహుల్ ద్రవిడ్‌ను కలిశాడు గంగూలీ. 

ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుని భారీ ఎత్తుగా చేరుకున్న అభిమానులతో సెల్ఫీ దిగాడు. ఈ ఫొటోకు నెట్టింట్లో మంచి స్పందన వస్తుంది. మాజీ జట్టు సహచరుడైన ద్రవిడ్ తో కలిసి కాసేపు చర్చించారు గంగూలీ. 

ఆదివారం నవంబరు 3న బంగ్లాదేశ్ తో జరగాల్సి ఉన్న తొలి టీ20 గురించి గంగూలీ స్పందించాడు. ఇటీవల దీపావళి కారణంగా అధిక సంఖ్యలో బాణాసంచా పేలుళ్ల జరిగాయి. సాధారణంగానే అధికంగా ఉండే కాలుష్య స్థాయి ఢిల్లీలో మరోసారి తారాస్థాయికి చేరుకుంది. క్రికెటర్లు ఇదే వాతావరణంలో ఎక్కువసేపు ఆడలేరని మ్యాచ్ జరిగేంతసేపు ఇబ్బందిపడతారని పర్యావరణ వేత్తలు గంగూలీకి లేఖ రాశారు. 

వీటిపై స్పందించిన గంగూలీ యథావిధిగా ముందు ప్లాన్ చేసినట్లుగానే బంగ్లాదేశ్‌తో తొలి టీ20మ్యాచ్ ను ఢిల్లీ వేదికగానే ఆడాలని వెల్లడించాడు.