ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వందో మ్యాచ్

ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వందో మ్యాచ్

Updated On : April 14, 2019 / 12:47 PM IST

ఐపీఎల్ సీజన్లో ఏప్రిల్ 14 ఆదివారం జరగనున్న మ్యాచ్‌ను సన్‌రైజర్స్ ప్రత్యేకంగా భావిస్తోంది. తన వందో మ్యాచ్ కాబట్టి ఈ గేమ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ మాట్లాడాడు.

‘ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా ఫిట్‌నెస్ సాధించడంతో ఈ మ్యాచ్ లో ఆడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ప్రత్యేకమైన మ్యాచ్ కావడంతో కచ్చితంగా విజయం సాధించే దిశగా పోరాడతామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  

‘మాతో కలిసి కొంతకాలం ప్రయాణించిన శిఖర్ ధావన్‌తో మాకు స్నేహం మాత్రమే ఉంది. అంతకుమించిన బంధాలేమి లేవు. ఈ మ్యాచ్ లో అతనిపై మా తరహా పోటీనే చూపిస్తాం. అవకాశం కోసం ఎదురుచూసి దానికి తగ్గట్టుగానే స్పందిస్తాం. డెత్ ఓవర్స్ సమస్యగా ఉంది. ఇప్పుడు దాన్ని కూడా అధిగమించానని అనుకుంటున్నాం’ అని ముగించాడు.