SRHvsMI: చిత్తుగా ఓడిన హైదరాబాద్

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో హైదరాబాద్ చిత్తుగా ఓఢిపోయింది. హైదరాబాద్ నిర్దేశించిన స్వల్ప టార్గెట్ ను సైతం చేధించలేక 40 పరుగుల వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముంబైని భారీగా కట్టడి చేశారని భావిస్తే అంతకంటే తీవ్రమైన ఒత్తిడిలోకి హైదరాబాద్ ని నెట్టేశారు ముంబై బౌలర్లు. బ్యాటింగ్ విభాగం మందగించినా ఫీల్డింగ్, బౌలర్లతో జట్టును గెలిపించేశాడు రోహిత్ శర్మ. ఓపెనర్లతో పాటు క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎవ్వరూ సరైన ప్రయత్నం చేయలేదు.
టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లలో జానీ బెయిర్ స్టో(16), డేవిడ్ వార్నర్ (15)లు స్వల్ప స్కోరు మాత్రమే నమోదు చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన విజయ్ శంకర్(5), మనీశ్ పాండే(16), దీపక్ హుడా(20), యూసఫ్ పఠాన్(0), మొహమ్మద్ నబీ(11), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్(2), సిద్ధార్థ్ కౌల్(0), సందీప్ శర్మ(5) చేయడంతో 96 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబైను ఆరంభం నుంచి కట్టడి చేసిన హైదరాబాద్ చివరి 2 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది. ఎనిమిదో వికెట్ గా బరిలోకి దిగిన పొలార్డ్ (46: 26 బంతుల్లోనే) చేసి జట్టులో అత్యథిక స్కోరు నమోదు చేయగలిగాడు. ముంబై స్టార్ ప్లేయర్లంతా పేలవంగా అవుట్ అవడంతో జట్టు స్కోరు నత్తనడకన సాగింది.
రోహిత్ శర్మ(11), క్వింటాన్ డికాక్(19), సూర్యకుమార్ యాదవ్(7), ఇషాన్ కిషన్(17), కృనాల్ పాండ్యా(6), హర్దిక్ పాండ్యా(14), రాహుల్ చాహర్(10). అల్జరీ జోసెఫ్(0)లు చేయగలిగారు. హైదరాబాద్ బౌలర్లు సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.