Sarfaraz Khan: స్లిమ్ముగా ఉండే ఆటగాళ్లే కావాలంటే ఫ్యాషన్ షోకు వెళ్లండి.. సెలెక్టర్లకు సునీల్ గవాస్కర్ సలహా

ఇటీవల రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రాణిస్తున్నాడు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు చివరి మూడు సెషన్స్ కలిపి 2441 రన్స్ పూర్తి చేశాడు. తాజా రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నిలకడగా ఆడుతున్నప్పటికీ, అతడికి భారత టెస్టు జట్టులో ఆడే అవకాశం రాలేదు.

Sarfaraz Khan: స్లిమ్ముగా ఉండే ఆటగాళ్లే కావాలంటే ఫ్యాషన్ షోకు వెళ్లండి.. సెలెక్టర్లకు సునీల్ గవాస్కర్ సలహా

Updated On : January 19, 2023 / 8:33 PM IST

Sarfaraz Khan: స్లిమ్ముగా, ట్రిమ్ముగా ఉండే ఆటగాళ్లే కావాలంటే ఫ్యాషన్ షోకు వెళ్లి ఎంపిక చేయాలని సెలెక్టర్లకు సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో రాణిస్తున్నప్పటికీ, అతడికి టెస్టుల్లో ఆడే అవకాశం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు.

Nora Fatehi: గల్‌ఫ్రెండుగా ఉంటే ఖరీదైన ఇల్లు ఇస్తానన్నాడు.. సుకేష్ చంద్రశేఖర్‌పై నోరా ఫతేహి ఆరోపణ

ఇటీవల రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రాణిస్తున్నాడు. 25 ఏళ్ల ఈ యువ ఆటగాడు చివరి మూడు సెషన్స్ కలిపి 2441 రన్స్ పూర్తి చేశాడు. తాజా రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నిలకడగా ఆడుతున్నప్పటికీ, అతడికి భారత టెస్టు జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా అతడికి చోటు దక్కలేదు. గతేడాది బంగ్లాదేశ్ టూర్‌కు ఎంపిక చేస్తామని అతడికి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ హామీ ఇచ్చినప్పటికీ ఎంపిక చేయలేదు. దీంతో అతడికి భారత జట్టుకు ఆడే అవకాశాలు రావడం లేదు. దీనిపై పలువురు సీనియర్ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టర్ల తీరును తప్పుబడుతున్నారు.

Rakhi Sawant: హాట్ బ్యూటీ రాఖీ సావంత్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా బీసీసీఐ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. అయితే, అతడు బరువుగా ఉండటం సమస్యగా మారిందా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. కానీ, సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌గానే ఉంటూ పరుగులు సాధిస్తున్నాడు. అయినా అతడ్ని జట్టుకు ఎంపిక చేయడం లేదు. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ తాజాగా సెలెక్టర్ల తీరును విమర్శించారు. ‘‘ఆటగాళ్లను బరువు, ఆకారం చూసి ఎంపిక చేయకూడదు. సర్ఫరాజ్ ఖాన్ ప్రదర్శన చూస్తే అతడు ఫిట్‌గానే ఉన్నాడని అర్థమవుతోంది. ఒకవేళ సెలెక్టర్లు స్లిమ్ముగా, ట్రిమ్ముగా ఉన్నవాళ్లనే ఎంపిక చేయాలి అనుకుంటే ఫ్యాషన్ షోకు వెళ్లాలి.

Anant Ambani Engagement: వైభవంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థం.. అంబానీ నివాసంలో జరిగిన వేడుక

ఆటగాళ్లను కాకుండా అక్కడ మోడల్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. మన దగ్గర అన్ని రకాల ఆటగాళ్లున్నారు. వాళ్ల సైజు, బరువును బట్టి కాకుండా వాళ్లు తీసే పరుగులు, వికెట్లను బట్టి ఎంపిక చేయాలి’’ అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తాను భారత జట్టుకు ఎంపిక కాకపోవడంపై సర్ఫరాజ్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.