Sunil Gavaskar : దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టు.. తెలుగోడికి నో ఛాన్స్.. !
టీ20 సిరీస్‌ను సమం చేసి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే ఊపులో టెస్టు సిరీస్ కోసం సిద్దమవుతోంది.

Sunil Gavaskar picks Indias best playing XI for first Test against South Africa
Sunil Gavaskar picks India playing XI : టీ20 సిరీస్‌ను సమం చేసి వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే ఊపులో టెస్టు సిరీస్ కోసం సిద్దమవుతోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ ఎలాగైనా సరే టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అదే సమయంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడతున్న సిరీస్ ఇదే కావడంతో దీనిపై అభిమానుల అందరి దృష్టి నెలకొని ఉంది.
భీకరఫామ్‌తో ఉన్న మహ్మద్ షమీ ఈ సిరీస్‌కు దూరం కావడం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. భారత పేస్ భారం మొత్తాన్ని జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లే మోయాల్సి ఉంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు భారత తుది జట్టు కూర్పు ఎలాగ ఉంటుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమ్ఇండియా తుది జట్టును అంచనా వేశారు.
Ashwin : భారత జట్టుకు అతి పెద్ద శత్రువు ఇతనే.. ఎందుకో తెలుసా..?
ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఆడతాడని చెప్పారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వస్తారన్నాడు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంచుకున్నాడు. కేఎస్ భరత్ తుది జట్టులో అవకాశం ఇవ్వనని చెప్పాడు. అయితే.. మ్యాచ్ పరిస్థితిని బట్టి అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయన్నాడు.
ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను తీసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మూడో పేసర్‌గా ముకేశ్ కుమార్ అయితే బాగుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సునీల్ గవాస్కర్ మొదటి టెస్టు కోసం స్పెషలిస్టు బ్యాటర్లు ఆరుగురు, ఆల్ రౌండర్లు ఇద్దరు, ఫాస్ట్ బౌలర్లు ముగ్గురిని ఎంపిక చేసుకున్నారు.
మొదటి టెస్టు కోసం గవాస్కర్ ఎంచుకున్న భారత జట్టు : రోహిత్ శర్మ( కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్.