Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్‌ నరైన్‌..

టీ20 క్రికెట్‌లో సునీల్ న‌రైన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్‌ నరైన్‌..

Courtesy BCCI

Updated On : April 30, 2025 / 9:25 AM IST

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఓ జ‌ట్టు త‌రుపున అత్యధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ ఘ‌న‌త‌ను అత‌డు స‌మిత్ ప‌టేట్‌తో షేర్ చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయ‌డం ద్వారా న‌రైన్ ఈ రికార్డును సాధించాడు.

ఇంగ్లాండ్‌ దేశవాలీ క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌ తరఫున ఆడుతూ స‌మిత్ ప‌టేల్ 208 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక న‌రైన్ 195 మ్యాచ్‌ల్లో కేకేఆర్ త‌రుపున ఆడి 208 వికెట్లు తీశాడు.

DC vs KKR : కేకేఆర్ చేతిలో ఓట‌మి త‌రువాత ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌.. అందుకే ఓడిపోయాం.. అశుతోష్ ఆడుంటే..

టీ20 క్రికెట్‌లో ఒకే జ‌ట్టు త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాళ్లు వీరే..

సునీల్‌ నరైన్ (కేకేఆర్‌) – 208 వికెట్లు
సమిత్‌ పటేల్ (నాటింగ్‌హామ్‌షైర్‌) – 208 వికెట్లు
క్రిస్‌ వుడ్ (హాంప్‌షైర్) – 199 వికెట్లు
లసిత్‌ మలింగ (ముంబై ఇండియన్స్‌) – 195 వికెట్లు
డేవిడ్‌ పెయిన్ (గ్లోసెస్టర్‌షైర్‌) – 193

నరైన్ తీసిన 208 వికెట్లలో 190 వికెట్లు 186 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే వచ్చాయి, మిగిలిన 18 వికెట్లు కేకేఆర్ తరఫున తొమ్మిది ఛాంపియన్స్ లీగ్ టీ20 మ్యాచ్‌ల్లో వచ్చాయి.

ఢిల్లీతో మ్యాచ్‌లో బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు సునీల్ న‌రైన్‌. 16 బంతుల్లో 27 ప‌రుగులు సాధించాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగులు సాధించింది. అంగ్క్రిష్ రఘువంశీ (44; 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రింకూ సింగ్‌ (36; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. విప్రాజ్ నిగ‌మ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడ‌రు. చ‌మీరా ఓ వికెట్ సాధించాడు.

Kuldeep Yadav slaps Rinku Singh : మ్యాచ్ త‌రువాత రింకూ సింగ్‌ చెంప చెళ్లుమ‌నిపించిన‌ కుల్దీప్ యాద‌వ్.. వీడియో వైర‌ల్‌.. అప్ప‌ట్లో శ్రీశాంత్‌ను హ‌ర్భ‌జ‌న్ కొట్టిన‌ట్లుగానే..!

ఆ త‌రువాత డుప్లెసిస్‌ (62; 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), అక్షర్‌ పటేల్‌ (43; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించిన‌ప్ప‌టికి ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు వికెట్లు తీయ‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనుకుల్ రాయ్‌, వైభ‌వ్ అరోరా చెరో వికెట్ సాధించారు.