India vs Australia 2nd Test: సూర్య, శ్రేయాస్ ఇద్దరిలో రెండో టెస్టులో చోటెవరికి..? క్లారిటీ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్
శ్రేయాస్ అయ్యర్ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ అయిదు రోజులు ఆడగలిగే స్థితిలో ఉంటే తుది జట్టులోకి వస్తాడని తెలిపాడు. శ్రేయాస్ ఫిట్‌నెస్ సాధించినందుకు సంతోషంగా ఉందన్న ద్రవిడ్.. అతడు ఆడే విషయంపై కొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.

Team India
India vs Australia 2nd Test: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లలో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ 17వ తేదీ నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ రెండు టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. సెలెక్టర్లు రెండో టెస్టుకు శ్రేయాస్ ను తుదిజట్టులో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అయ్యర్ తుది జట్టులోకి వస్తే సూర్యకుమార్ యాదవ్ తుదిజట్టులో స్థానం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.
IND vs AUS Test Match: ఇండియా, ఆసీస్ మూడో టెస్ట్ మ్యాచ్ వేదిక మారింది.. ట్వీట్ చేసిన బీసీసీఐ
నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఆసీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ద్వారానే సూర్యకుమార్ అంతర్జాతీయ టెస్ట్ ఫార్మాట్‍లోకి అరంగ్రేటం చేశారు. అయితే తొలి టెస్టులో సూర్య రాణించలేక పోయాడు. క్రీజ్ లో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ క్రమంలో రెండో టెస్టులో సూర్య ప్లేస్‌లో శ్రేయాస్ కు అవకాశం కల్పించేందుకు సెలెక్టర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు కె.ఎల్. రాహుల్, కేఎస్ భరత్ లు సైతం తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేదు. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు తుదిజట్టులో చోటుకోసం ఆశగా ఉన్నారు. ఒకవేళ రెండో టెస్టులోనూ రాహుల్, భరత్ విఫలమైతే గిల్, ఇషాన్ కిషన్లకు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
IND vs AUS 1st Test Match: తొలిటెస్టులో ఆసీస్‌పై టీమిండియా ఘన విజయం .. మూడోరోజు ఆట ఫొటోలు
శ్రేయాస్ అయ్యర్ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ అయిదు రోజులు ఆడగలిగే స్థితిలో ఉంటే తుది జట్టులోకి వస్తాడని తెలిపాడు. శ్రేయాస్ ఫిట్‌నెస్ సాధించినందుకు సంతోషంగా ఉందన్న ద్రవిడ్.. అతడు ఆడే విషయంపై కొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. శ్రేయాస్ బుధవారం కాసేపు ప్రాక్టీస్ చేశాడు. గురువారం అతడి ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తామని తెలిపాడు. అయితే, శ్రేయాస్ అయిదు రోజుల టెస్టు మ్యాచ్ ఆడగలిగే స్థితిలో ఉంటే ఖచ్చితంగా రెండో టెస్టు తుదిజట్టులోకి వస్తాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.