IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. సచిన్ మరో రికార్డును బద్దలు కొట్టేశాడు..
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

BCCI
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (57) ఆఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో సూర్య సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌లో 583 పరుగులు చేశాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో సూర్య 600 పరుగుల మార్కును దాటాడు. ఐపీఎల్ లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2023 సీజన్ లో తొలిసారి 600 ప్లస్ పరుగులు (605) చేసిన సూర్య.. ఈ సీజన్ లో మరోసారి 600 పరుగుల మైలురాయిని దాటేశాడు. ఇదే క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
2010 ఐపీఎల్ సీజన్ లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున 618 పరుగులు చేశాడు. సచిన్ 15ఏళ్ల రికార్డును సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు.
ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ముంబై ఆటగాళ్లు వీరే..
సూర్యకుమార్ యాదవ్ – 619* పరుగులు (IPL 2025)
సచిన్ టెండూల్కర్ – 618 పరుగులు (ఐపీఎల్ 2010)
సూర్యకుమార్ యాదవ్ – 605 పరుగులు (IPL 2023)
సచిన్ టెండూల్కర్ – 553 పరుగులు (ఐపీఎల్ 2011)
లెండిల్ సిమ్మన్స్ – 540 పరుగులు (ఐపీఎల్ 2015)
రోహిత్ శర్మ – 538 పరుగులు (ఐపీఎల్ 2013)
🚨 SURYA SURPASSES SACHIN. 🚨
– Suryakumar Yadav surpasses Sachin Tendulkar’s record of having most runs for MI in an IPL season. 🤯 pic.twitter.com/84GBt0uv7h
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2025