IPL 2025: ఇంగ్లిస్, ప్రియాన్ష్ ఊచకోత.. ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. వారివళ్లే ఓడామంటూ..

కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై ఓటమి తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.

IPL 2025: ఇంగ్లిస్, ప్రియాన్ష్ ఊచకోత.. ఓటమిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక కామెంట్స్.. వారివళ్లే ఓడామంటూ..

BCCI

Updated On : May 27, 2025 / 7:04 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది.

Also Read: IPL 2025: లక్నోపైనే గుజరాత్ ఆశలన్నీ.. ఆర్సీబీ గెలిస్తే టాప్ 2 ప్లేస్ గల్లంతే..! సమీకరణాలు ఇలా..

టాస్ ఓడి తొలుత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (57) ఆఫ్ సెంచరీ చేశాడు. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం 18.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య (62), జోష్ ఇంగ్లిష్ (73) ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ముంబై టాప్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా బౌలింగ్ లోనూ బౌండరీల మోత మోగించారు. ఈ ఇద్దరి మెరుపు భాగస్వామ్యమే (59 బంతుల్లో 109) పంజాబ్ కింగ్స్ జట్టును అలవోకగా గెలిపించింది.

 

ఓటమి తరువాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. ‘‘మేము 20 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. ఇటీవల మా జట్టు మంచి ఆటతీరును కనబరుస్తుంది. అయితే, ఈరోజు మా ఉత్తమ ఆట ప్రదర్శించలేకపోయాం. అదేమాకు నష్టం చేసింది. ఒక్కసారి ఒత్తిడి తగ్గిస్తే ప్రత్యర్థులు దానిని ఉపయోగించుకుంటారు. ఈ మ్యాచ్ ను పాఠంగా తీసుకొని నాకౌట్ దశ కోసం మేము సిద్ధం అవ్వాలి. పంజాబ్ బ్యాటర్లు అద్భుంగా ఆడారు. తాము అంతగొప్పగా బౌలింగ్ చేయలేక పోయాం. ఇప్పుడు ఎలిమినేటర్ లోకి వెళ్తున్నాం. అక్కడ మంచి బ్యాటింగ్, బౌలింగ్ తో కూడా అద్భుత ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ హార్దిక్ చెప్పారు.