IPL 2025: లక్నోపైనే గుజరాత్ ఆశలన్నీ.. ఆర్సీబీ గెలిస్తే టాప్ 2 ప్లేస్ గల్లంతే..! సమీకరణాలు ఇలా..

ఐపీఎల్ -2025లో గుజరాత్, పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలకోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.

IPL 2025: లక్నోపైనే గుజరాత్ ఆశలన్నీ.. ఆర్సీబీ గెలిస్తే టాప్ 2 ప్లేస్ గల్లంతే..! సమీకరణాలు ఇలా..

BCCI

Updated On : May 26, 2025 / 2:52 PM IST

IPL 2025: ఐపీఎల్ -2025 టోర్నీలో భాగంగా గుజరాత్, పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరిన విషయం తెలిసిందే. అయితే, నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలకోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ పోటీలో గుజరాత్ జట్టు చేతులెత్తేసింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ఆ జట్టు టాప్-2లో ప్లేస్ కోల్పోయే పరిస్థితికి వెళ్లింది. అయితే, గుజరాత్ టాప్-2 ప్లేస్ లో ఉండాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయావకాశాలపై ఆధారపడి ఉంటుంది.

Also Read: IPL 2025: చెన్నై చేతిలో ఓటమి.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్.. ‘గత రెండు మ్యాచ్‌లలో అందుకే ఓడిపోయాం’..

పంజాబ్ ఓడినా గుజరాత్‌కు నో ఛాన్స్..
♦ చెన్నై జట్టుపై గుజరాత్ ఓడిపోయినప్పటికీ 18 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.
♦ సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
♦ ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించినా టాప్ -2లోకి వెళ్లే అవకాశం ఉంది.
♦ ప్రస్తుతం 17 పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉన్న పంజాబ్ జట్టు గెలిస్తే టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది.
♦ ఒకవేళ ముంబై జట్టు గెలిస్తే 18 పాయింట్లతో గుజరాత్ తో సమానంగా ఉంటుంది. కానీ, రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ముంబై జట్టే టాప్-2 ప్లేస్ ను ఖాయం చేసుకుంటుంది.
♦ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. పంజాబ్ కింగ్స్ జట్టు 18 పాయింట్లతో గుజరాత్ కంటే మెరుగైన రన్ రేట్ కలిగి ఉండటంతో టాప్ -2లో ప్లేస్ ఖాయం చేసుకుంటుంది.

 

ఆర్సీబీ ఓడిపోతే ఛాన్స్..
♦ గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో కొనసాగాలంటే ఆర్సీబీ తన చివరి మ్యాచ్ లో ఓడిపోవాలి.
♦ ఈనెల 27న లక్నో వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
♦ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే 19 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో ప్లేస్ ఖాయం చేసుకుంటుంది.
♦ ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే 17 పాయింట్లకే పరిమితం అవుతుంది. దీంతో గుజరాత్ 18 పాయింట్లతో టాప్ రెండు స్థానాల్లో ప్లేస్ దక్కించుకుంటుంది.
♦ వర్షం కారణంగా ఆర్సీబీ vs లక్నో మ్యాచ్ రద్దయితే గుజరాత్ కే దెబ్బ. ఎందుకంటే.. 18పాయింట్లతో గుజరాత్, ఆర్సీబీ సమంగా ఉంటాయి. కానీ, రన్ రేట్ పరంగా ఆర్సీబీనే మెరుగ్గా ఉంది. దీంతో ఆర్సీబీ టాప్ రెండు స్థానాల్లో చోటు దక్కించుకుంటుంది.
♦ మొత్తానికి గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాల్లో ప్లేస్ ఖాయం చేసుకోవాలంటే లక్నో జట్టుపై ఆర్సీబీ ఓడిపోవాల్సిందే.