IPL 2025: చెన్నై చేతిలో ఓటమి.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్.. ‘గత రెండు మ్యాచ్‌లలో అందుకే ఓడిపోయాం’..
చెన్నై జట్టుపై ఓటమి అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.

BCCI
IPL 2025: ప్లే ఆఫ్స్ కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ వెళ్తూవెళ్తూ గుజరాత్ టైటాన్స్ జట్టును గట్టి దెబ్బకొట్టింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ జట్టు టాప్-2లో స్థానం కోల్పోయే పరిస్థితిల్లోకి వెళ్లింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సీఎస్కే 83 పరుగుల తేడాతో టైటాన్స్ పై ఘన విజయం సాధించింది.
Also Read: IPL 2025: పంజాబ్‌కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ.. అనూహ్యంగా టాప్-2 రేసులోకి ముంబై..! ఎలా అంటే?
తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ జట్టు ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 18.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఓటమి తరువాత కూడా పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. ఈనెల 27న లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే గుజరాత్ టాప్ -2లో స్థానం కోల్పోతుంది.
చెన్నై జట్టుపై ఓటమి అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. ‘‘పవర్ ప్లేలోనే మ్యాచ్ తమ నుంచి దూరమైందని అర్ధమైంది. అప్పటి నుంచి తాము మ్యాచ్ లోకి తిరిగిరాలేమని అనిపించింది. 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఎప్పుడైనా కష్టమే. ఇప్పటికే ఎలిమినేట్ అయిన జట్లు కోల్పోవడానికి ఇంకా ఏమీలేదు. దీంతో వారు బలంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడతారు. తాము ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడలేకపోయాం. గత రెండు మ్యాచ్ లలో మేము మిస్ అయింది ఇదే’’ అని గిల్ చెప్పాడు.