IND vs SA Final : ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? తాజా వివరాలు ఇక్కడ చూడండి ..

భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8గంటల (బార్బడోస్ లో ఉదయం 10.30గంటలు) నుంచి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. స్థానిక వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..

IND vs SA Final : ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? తాజా వివరాలు ఇక్కడ చూడండి ..

IND vs SA Final Match

T20 World Cup 2024 Final : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. బార్బడోస్ లోని బ్రిడ్జ్‌టౌన్‌ కెన్సింగ్‌టన్ ఓవల్‌ వేదికగా శనివారం రాత్రి 8గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచిఉంది. వర్షం కారణంగా శనివారం మ్యాచ్ జరగకుంటే రిజర్వ్ డే అయిన ఆదివారం రోజు రెండు జట్ల మధ్య మ్యాచ్ ను నిర్వహిస్తారు. ఆదివారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. టీ20 వరల్డ్ కప్ 2024 విజేతలుగా ఇండియా, సౌతాఫ్రికా జట్లను ప్రకటిస్తారు. అయితే, బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్ లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

Also Read : పదేళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ పోరులో టీమిండియా.. ఇండియన్స్, సఫారీల సమరంలో గెలుపెవరిది?

భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8గంటల (బార్బడోస్ లో ఉదయం 10.30గంటలు) నుంచి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. స్థానిక వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో 51శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆకాశం చాలా వరకు మేఘావృతం అయ్యి ఉంటుంది. అప్పుడప్పుడు సూర్యరశ్మి వచ్చినా.. కొద్దిసేపటికే మోస్తరు జిల్లులు కురిసే అవకాశం ఉంటుంది. ఉరుములతో కూడిన గాలివాన పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read : IND vs SA : ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే విజేత ఎవ‌రంటే..?

తాజా వివరాల ప్రకారం..
సాయంత్రం 6.30 గంటలకు ( బార్బడోస్ లో ఉదయం 9గంటలు) : వర్షంపడే అవకాశం 47శాతం ఉంటుంది.
రాత్రి 7.30 గంటలకు (ఉదయం 10 గంటలు) వర్షంపడే అవకాశం 29శాతం.
రాత్రి 8.30 గంటలకు (ఉదయం 11గంటలు) వర్షంపడే అవకాశం 29శాతం.
రాత్రి 9.30 గంటలకు (మధ్యాహ్నం 12గంటలు) వర్షంపడే అవకాశం 35శాతం.
రాత్రి 10.30 గంటలకు (మధ్యాహ్నం 1గంటకు) వర్షంపడే అవకాశం 51శాతం.
రాత్రి 11.30 గంటలకు (మధ్యాహ్నం 2గంటలకు) వర్షం పడే అవకాశం 47శాతం.
రాత్రి 12.30 గంటలకు (మధ్యాహ్నం 3గంటలకు) వర్షంపడే అవకాశం 40శాతం.