T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్..
టీ20 ప్రపంచకప్ 2026కి (T20 World Cup 2026) ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది.
T20 World Cup 2026 Kyle Jamieson Replaces Injured Adam Milne In New Zealand Squad
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగాటోర్నీ ప్రారంభానికి చాలా తక్కువ సమయమే ఉంది. ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
సౌతాఫ్రికా టీ20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ కు ఆడమ్ మిల్నే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఆదివారం సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్, ఎంఐ కేప్ టౌన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆడమ్ మిల్నే గాయపడ్డాడు. అతడికి నిర్వహించిన స్కానింగ్ లో గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతడు ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు.
Wishing Adam all the best for his recovery 🖤
Full story at https://t.co/3YsfR1Y3Sm or the NZC app 📲 #T20WorldCup pic.twitter.com/AGvd4HKFRe
— BLACKCAPS (@BLACKCAPS) January 23, 2026
తొడ కండరాల గాయంతో బాధపడుతుండడంతోనే టోర్నీకి దూరం అయినట్లు కివీస్ బోర్డు తెలియజేసింది. అతడి స్థానంలో కైల్ జేమీసన్‌ను ఎంపిక చేసింది. ట్రావెల్ రిజర్వు ఉన్న జేమిసన్.. మిల్నే గాయపడడంతో ప్రధాన జట్టులోకి వచ్చాడు.
T20 World Cup Row : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక నష్టం..? ఏకంగా 240 కోట్లకు పైనే?
దీనిపై న్యూజిలాండ్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ టీ20 ప్రపంచకప్‌లో కైల్ బాగా రాణిస్తాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అతడు ప్రస్తుతం భారత పర్యటనలో జట్టుతోనే ఉండడం చాలా బాగుందని, అతడు తమ పేస్ బౌలింగ్ గ్రూప్‌లో అంతర్భాగంగా పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్‌కు నవీకరించిన న్యూజిలాండ్ జట్టు ఇదే..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.
