IND vs ENG 3rd Test : మూడో రోజు ఆట‌లో న‌ల్ల‌రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. ఎందుకో తెలుసా?

రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగారు.

IND vs ENG 3rd Test : మూడో రోజు ఆట‌లో న‌ల్ల‌రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. ఎందుకో తెలుసా?

Indian players wear black armbands to pay tribute to Dattajirao Gaekwad

IND vs ENG : రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగారు. టీమ్ఇండియా ఆట‌గాళ్లు ఇలా ఎందుకు ఆడుతున్నారో కొంద‌రికి అర్థం కాలేదు. ఈ విష‌యం పై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్ప‌ష్ట‌త నిచ్చింది. భార‌త మాజీ కెప్టెన్‌, టెస్ట్ క్రికెట‌ర్ ద‌త్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా ప్లేయ‌ర్లు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించార‌ని సోష‌ల్ మీడియాలో బీసీసీఐ తెలిపింది.

టీమ్ఇండియా త‌రుపున ద‌త్తాజీరావు గైక్వాడ్ 11 టెస్టు మ్యాచులు ఆడాడు. 350 ప‌రుగులు చేశాడు. ఓ అర్థ‌శ‌త‌కం అత‌డి పేరిట ఉంది. 1959లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. వృద్యాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ ద‌త్తాజీరావు ఫిబ్ర‌వ‌రి 13 మంగ‌ళ‌వారం మ‌ర‌ణించాడు. అప్ప‌టికీ అత‌డి వ‌య‌సు 95 ఏళ్లు.

IND vs ENG : టెస్టు మ్యాచ్ మ‌ధ్య‌లో వెళ్లిపోయిన అశ్విన్‌.. అత‌డి స్థానంలో అక్ష‌ర్ ఆడొచ్చా? నిబంధ‌న‌లు ఏమి చెబుతున్నాయంటే?

ఇదిలా ఉంటే మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(132), ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా (112) లు సెంచ‌రీల‌తో చెల‌రేగడంతో భార‌త జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగులు చేసింది. అరంగేట్ర ఆట‌గాళ్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్‌(46)లు రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్‌వుడ్ నాలుగు వికెట్లు తీశాడు. రెహాన్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేమ్స్ అండ‌ర్స‌న్‌, టామ్ హార్డ్లీ, జో రూట్‌లు తలా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు లంచ్ విరామ స‌మ‌యానికి ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 290 ప‌రుగులు చేసింది. ఓపెనర్ బెన్ డ‌కెట్(153) భారీ శ‌త‌కం చేశాడు. ప్ర‌స్తుతం క్రీజులో కెప్టెన్‌ బెన్‌స్టోక్స్ (39), బెన్ ఫోక్స్ (6) లు ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు, బుమ్రా, సిరాజ్‌, అశ్విన్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

స్లిప్‌లో జైస్వాల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ ఆట‌గాడు జో రూట్‌