Ben Stokes: పాపం.. బెన్ స్టోక్స్.. షేక్ హ్యాండ్ కు నో చెప్పిన భారత బ్యాటర్లు.. షాక్ లో ఇంగ్లాండ్ కెప్టెన్..
మనోళ్లు అలా అనేసరికి బెన్ స్టోక్స్ షాక్ కి గురయ్యాడు. పాపం బెన్ స్టోక్స్ ముఖం వాడిపోయింది.

Ben Stokes: నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వీరోచిత పోరాటం చూపించారు. తొలుత కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు. ఆ తర్వాత రాహుల్ 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆపై క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. అజేయంగా క్రీజులో నిలిచారు. దీంతో ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 143 ఓవర్లు ఆడిన భారత్ 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
కాగా, ఈ మ్యాచ్ లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు మనోళ్లు బిగ్ షాక్ ఇచ్చారు. మ్యాచ్ డ్రా చేయాలని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బెన్ స్టోక్స్ ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో జడేజా, సుందర్ లు సెంచరీలకు దగ్గరలో ఉన్నారు. వారిద్దరూ 90లలో ఉన్నారు. దాంతో స్టోక్స్ ప్రతిపాదనకు మనోళ్లు నో చెప్పారు. అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. మనోళ్లు అలా అనేసరికి బెన్ స్టోక్స్ షాక్ కి గురయ్యాడు. పాపం స్టోక్స్ ముఖం వాడిపోయింది.
ఇక జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాక బ్రూక్ సైతం మ్యాచ్ డ్రా చేయాలని చెప్పగా.. జడేజా, సుందర్ లు పట్టించుకోలేదు. దీంతో ఇంకా ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారు అంటూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే, ఇంగ్లాండ్ పై జడేజా, సుందర్ లు సెంచరీలు చేయకూడదనే ఉద్దేశంతోనే బెన్ స్టోక్స్ డ్రా ప్రతిపాదన తెచ్చాడని, ఇది గ్రహించిన భారత్.. అతడి ఆఫర్ ను నిరాకరించిందని తెలుస్తోంది.
స్టోక్స్ అంపైర్ల వద్దకు వెళ్లి భారత ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి ముందుకొచ్చాడు. ఆ సమయంలో భారత్ స్కోర్ 4 వికెట్లకు 386 పరుగులు కాగా, 75 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగా, స్వదేశీ జట్టుకు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం లేదని ఇంగ్లాండ్ కెప్టెన్ అంగీకరించాడు. డ్రా ఆఫర్ చేశాడు.
అయితే స్టోక్స్ ఆఫర్ ను జడేజా, సుందర్ తిరస్కరించారు. ఆటను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఇద్దరు భారత ఆల్ రౌండర్లు తమ సెంచరీలకు దగ్గరగా ఉన్నారు. అంతేకాదు మ్యాచ్‌లో ఇంకా సమయం మిగిలి ఉండగా క్రీజులో ఉండటానికి వారికి హక్కు ఉంది. డ్రాను తిరస్కరించాలనే భారత నిర్ణయంతో బెన్ స్టోక్స్ పూర్తిగా షాక్ కి గురయ్యాడు. అంపైర్, ఇద్దరు బ్యాటర్లతో సుదీర్ఘ చర్చ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ తల అడ్డంగా ఊపుతూ కనిపించాడు. ఆ తర్వాత సిక్స్ కొట్టి జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే సుందర్ కూడా శతకం బాదాడు. 143వ ఓవర్ చివరలో బౌండరీతో తన తొలి సెంచరీని సుందర్ నమోదు చేయడంతో రెండు జట్లు కరచాలనం చేసుకున్నాయి. మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Also Read: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆసియా కప్ 2025 ఆడకపోవడానికి అసలు కారణం ఏంటి?