‘ఎప్పటికీ కృతజ్ఞతతో’.. రోహిత్ శర్మ ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్.. 18ఏళ్ల నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ..

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

‘ఎప్పటికీ కృతజ్ఞతతో’.. రోహిత్ శర్మ ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్.. 18ఏళ్ల నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ..

Updated On : June 23, 2025 / 2:14 PM IST

Rohit Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే, భారత వన్డే కెప్టెన్‌గా కొనసాగుతున్న రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఎప్పటికీ కృతజ్ఞతతో’ అంటూ భావోద్వేగ పోస్టు చేశారు.

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి నేటితో 18ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 23 జూన్ 2007లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి రోహిత్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి నేటి వరకు టీమిండియాలో కీలక ప్లేయర్ గా రోహిత్ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి 18ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రోహిత్ తన అరంగేట్రం తేదీని ప్రస్తావిస్తూ ఎప్పటికీ కృతజ్ఞతతో 23.06.07 అని రాశాడు.

38ఏళ్ల రోహిత్ శర్మ.. టెస్ట్‌, టీ20 క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అతను టెస్టుల్లో 67 మ్యాచ్‌లు, టీ20 ఫార్మాట్‌లో 159 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 40.57 సగటుతో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలతోసహా 4,301 పరుగులు చేశాడు. టీ20ల్లో ఐదు సెంచరీలు, 32 అర్ధ సెంచరీలతో 4231 పరుగులు చేశాడు.
వన్డేల్లో ఇప్పటి వరకు 273 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 32 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలతో 48.76 సగటుతో 11,168 పరుగులు చేశాడు.