ఇదికదా డ్యాన్స్ అంటే.. కోహ్లీ, రోహిత్ సహా టీమిండియా ప్లేయర్స్ డ్యాన్స్ వీడియో చూశారా.. వైరల్

భారత క్రికెటర్లు వాంఖడే స్టేడియంలో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇదికదా డ్యాన్స్ అంటే.. కోహ్లీ, రోహిత్ సహా టీమిండియా ప్లేయర్స్ డ్యాన్స్ వీడియో చూశారా.. వైరల్

Virat kohli and Rohit Sharma Dance

Rohit Sharma and Virat Kohli Dance : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో విజయం తరువాత క‌రేబియ‌న్ దీవుల నుంచి స్వ‌దేశానికి చేరుకున్న భారత్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్ టాప్ వాహనంపై భారత్ ఆటగాళ్లు ముంబయిలో మెరైన్ డ్రైవ్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇసుకేస్తే రాలనంత స్థాయిలో అభిమానులు తరలివచ్చి తమ అభిమాన క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. కొందరు దారిపొడవునా ఉన్న చెట్లపైకి ఎక్కి క్రికెటర్లకు అభివాదం చేశారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ముంబయిలోని వాంఖ‌డే స్టేడియంలో బీసీసీఐ ఆటగాళ్లను స‌న్మానించింది. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీ సహా టీమిండియా ఆటగాళ్లు స్టేడియం మొత్తం కలిగితిరుగుతూ సందడి చేశారు. దీంతో స్టేడియం మొత్తం టీమిండియా ప్లేయర్స్ నామస్మరణతో మారుమోగిపోయింది.

Also Read : Team India : వాంఖడేలో వందేమాతరం గీతాలాపన సమయంలో క్రికెటర్ల వీడియో చూశారా.. గూజ్‌బమ్స్ అంతే!

వాంఖడే స్టేడియంలో టీమిండియా ప్లేయర్స్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తో పాటు మిగిలిన ఆటగాళ్లు తీన్ మార్ స్టెప్పులు వేస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించారు. జాతీయ జెండాలను చేతబూని డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలోని అభిమానులు కోహ్లీ, రోహిత్ తోపాటు ఇతర క్రికెటర్ల నామస్మరణతో హోరెత్తించారు.

Also Read : Team India : వాంఖడే స్టేడియంలో కోహ్లీ, రోహిత్ భావోద్వేగ ప్రసంగం.. వారు ఏమన్నారంటే

భారత క్రికెటర్లు వాంఖడే స్టేడియంలో డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.