Virat Kohli : టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్.. సోషల్ మీడియాలో భావోద్వేగపు పోస్ట్..
టెస్టులకు కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు.

Team India star batter Virat Kohli Announces Retirement From Test Cricket
టీమ్ఇండియా టెస్టు క్రికెట్‌లో మరో శకం ముగిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ నడిచాడు. టెస్టులకు కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పార్మాట్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎంతో గర్వకారణం అని చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపు పోస్ట్‌ను పంచుకున్నాడు.
‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి 14 ఏళ్లు గడిచాయి. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ ఫార్మాట్‌లో నా ప్రయాణం ఇంత గొప్పగా, ఇంతకాలం సాగుతుందని ఊహించలేదు. ఈ ఫార్మాట్ నన్ను ఆటగాడిగా ఎంతో పరీక్షించింది, నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలను నేర్పించింది. వాటిని వ్యక్తిగత జీవితంలోనూ అనుసరిస్తాను.
తెల్లటి దుస్తులు ధరించి దేశం కోసం ఆడడం ఎంతో ప్రత్యేకమైంది. ఈ ఫార్మాట్‌లో ఆడిన ప్రతి రోజును ఎంతో ఆస్వాదించాను. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అవి ఎన్నటికి గుర్తుండిపోతాయి.
ఈ పార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం అది ఈజీ కాదు. కానీ ఇందుకు ఇదే సరైన సమయం అని అనిపిస్తోంది. నేను ఈ ఫార్మాట్‌లో రాణించేందుకు నా సర్వస్వాన్ని ధారపోయాను. అందుకు ఆట కూడా నాకు ఎంతో తిరిగి ఇచ్చింది. వాస్తవానికి నేను ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.
క్రికెట్‌కు, మైదానంలోని నా సహచరులు, ఈ ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం కొనసాగించేలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా, కృతజ్ఞతా భావంతో టెస్టుల నుంచి వైదొలుగుతున్నాను.
నా టెస్టు కెరీర్ ఎంతో సంతృప్తికరం. నేనేప్పుడు దీని గురించి తలచుకున్నా నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది. #269.. ఇక సెలవు.’ అని కోహ్లీ రాసుకొచ్చాడు.
View this post on Instagram
విరాట్ కోహ్లీ భారతదేశం తరపున 123 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 46.9 సగటు 55.6 స్ట్రైక్‌రేటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254 నాటౌట్. తన టెస్టు కెరీర్‌లో కోహ్లీ ఏడు సార్లు డబుల్ సెంచరీలు చేశాడు.
IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు..!
టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా కోహ్లీ రిటైర్ అయ్యాడు, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సునీల్ గవాస్కర్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది కోహ్లినే.