Australia vs India: హాఫ్ సెంచరీలు బాదిన టిమ్ డేవిడ్‌, మార్కస్ స్టొయినిస్‌.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే?

ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

Australia vs India: హాఫ్ సెంచరీలు బాదిన టిమ్ డేవిడ్‌, మార్కస్ స్టొయినిస్‌.. భారత్‌ టార్గెట్‌ ఎంతంటే?

Updated On : November 2, 2025 / 3:24 PM IST

Australia vs India: ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియాలోని బెల్లెరివ్ ఓవల్‌లో జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్‌ ముందు ఆస్ట్రేలియా 187 పరుగుల టార్గెట్ ఉంచింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్ హెడ్‌ 6, మిచెల్ మార్ష్‌ 11, జోష్ ఇంగ్లిస్‌ 1, టిమ్ డేవిడ్‌ 74, మిచెల్ ఓవెన్‌ 0, మార్కస్ స్టొయినిస్‌ 64, మాథ్యూ షార్ట్‌ 26, జేవియర్ బార్ట్‌లెట్ 3 పరుగులు తీశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌ 2, వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబే 1 వికెట్ పడగొట్టారు. దీంతో 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 186-6 స్కోరు చేసింది.

Also Read: రైలులో ప్రయాణికులను పొడుచుకుంటూ వెళ్లిన ఉగ్రవాదులు.. వణికిపోతూ వాష్‌రూమ్‌లలో దాక్కున్న ప్యాసింజర్స్‌

ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్‌ (కెప్టెన్), ట్రావిస్ హెడ్‌, జోష్ ఇంగ్లిస్‌ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్‌, మిచెల్ ఓవెన్‌, మార్కస్ స్టొయినిస్‌, మాథ్యూ షార్ట్‌, షాన్ అబ్బాట్‌, జేవియర్ బార్ట్‌లెట్‌, నాథన్ ఎల్లిస్‌, మాథ్యూ కుహ్నెమన్‌

భారత్‌ జట్టు 
శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మ‌, సూర్యకుమార్ యాదవ్‌ (కెప్టెన్), తిలక్ వర్మ‌, జితేశ్ శర్మ‌ (వికెట్ కీపర్), శివమ్ దూబే‌, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్ సుందర్‌, అర్ష్‌దీప్ సింగ్‌, వరుణ్ చక్రవర్తి‌, జస్ప్రీత్ బుమ్రా