సఫారీలపై భారత ఘన విజయం

సఫారీలపై భారత ఘన విజయం

Updated On : October 6, 2019 / 8:48 AM IST

సొంతగడ్డపై సఫారీలపై జరుగుతున్న పోరులో భారత్ 203పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ల ప్రభంజనం జట్టుకు ఊతమిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(176, 23ఫోర్లు, 6సిక్సులు), మయాంక్ అగర్వాల్(215, 23ఫోర్లు, 6సిక్సులు)ల దూకుడు జట్టుకు భారీ స్కోర్ వచ్చేలా చేసింది. ఇలా తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి 502పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్‌గా దక్కిన అవకాశాన్ని రోహిత్ శర్మ చక్కగా వినియోగించుకున్నాడు. సఫారీ బౌలర్లకు ధీటుగా బ్యాటింగ్ చేస్తూ 127పరుగులతో స్కోరును చక్కదిద్దాడు. అతనికి తోడుగా పూజారా బ్యాటింగ్ జట్టును ఆదుకుంది. 323 పరుగుల పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి చేశారు. 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 431పరుగులు చేసైి ఆలౌట్‌గా ముగించింది. రెండో ఇన్నింగ్స్ లోనూ ఏ మాత్రం కుదురుకోలేక 191పరుగులకే చేతులెత్తేసింది. డానె పీడిట్ (56)దే జట్టులో హై స్కోరు. ఫలితంగా 395 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగి 203పరుగుల దూరంలో సఫారీలు కుప్పకూలారు.