Sourav Ganguly: ‘గేమ్ పట్ల గంగూలీ కంటే ప్యాషనేట్ మరొకరుండరు’

క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త సీఈఓ నిక్ హాక్లీ.. బీసీసీఐ ప్రెసిడెంట్.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తెగ పొగిడేస్తున్నాడు. గేమ్ పట్ల గంగూలీ కంటే ఫ్యాషనేట్ ఇంకొకరుండరని అంటున్నాడు. ఏడాది కాలంగా నిక్ హాక్లీ, సౌరవ్ గంగూలీలు క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటున్నారు.

Sourav Ganguly: ‘గేమ్ పట్ల గంగూలీ కంటే ప్యాషనేట్ మరొకరుండరు’

Ganguly

Updated On : June 10, 2021 / 1:05 PM IST

Sourav Ganguly: క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త సీఈఓ నిక్ హాక్లీ.. బీసీసీఐ ప్రెసిడెంట్.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తెగ పొగిడేస్తున్నాడు. గేమ్ పట్ల గంగూలీ కంటే ఫ్యాషనేట్ ఇంకొకరుండరని అంటున్నాడు. ఏడాది కాలంగా నిక్ హాక్లీ, సౌరవ్ గంగూలీలు క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఇరు బోర్డుల మధ్య కీలక దశలు నడిచాయి. బ్రిస్బేన్ టెస్ట్ సాగా ఆడేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్లను ఐపీఎల్ నుంచి సేఫ్ గా ఆస్ట్రేలియాకు పంపించారు.

గంగూలీతో పాటు అతని టీం మానవతా దృక్పథంతో ఆలోచించిస్తుందని కొనియాడారు. రాబోయే చారిత్రక టెస్టు ఫార్మాట్ ఇండియా.. ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరగనుంది. క్రికెట్ భవిష్యత్ గురించి ఆలోచించే ఈ రెండు బోర్డులు పనిచేస్తున్నాయి.

‘అతను చాలా గ్రేట్. మంచి వ్యక్తి.. సింపుల్ గా ఉండే మనిషి. ఒకటి చెప్పాలా.. అతనికంటే ప్యాషనేట్ గా మరొకరు ఉండరు. అతనితో పాటు కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. రాబోయే టెస్టు ఫార్మాట్ కోసం ఇండియన్ మహిళల జట్టు ఇక్కడకు రానుంది.

మాకు తెలుసు వాళ్లు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. వారికి ఇది చాలా పెద్ద మూమెంట్. క్రికెట్ ను మెరుగుపరచడానికి కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందని నిక్ హాక్లీ వెల్లడించారు.