MS Dhoni : రిటైర్‌మెంట్ పై మౌనం వీడిన ధోని.. వీల్‌ఛైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..

త‌న రిటైర్‌మెంట్ పై వ‌స్తున్న వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు ధోని మౌనం వీడాడు.

MS Dhoni : రిటైర్‌మెంట్ పై మౌనం వీడిన ధోని.. వీల్‌ఛైర్‌లో ఉన్నా లాక్కెళ్తారు..

PIC Credit @csk

Updated On : March 23, 2025 / 2:09 PM IST

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి నాలుగున్న‌రేళ్లు దాటినా కూడా టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ ఫాయింగ్ త‌గ్గ‌లేదు స‌రికదా మ‌రింతగా పెరిగింది. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు ధోని. గ‌త కొన్ని సీజ‌న్లుగా అత‌డు ఆట‌కు వీడ్కోలు చెబుతాడు అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ధోని మాత్రం వాటిని రూమ‌ర్లుగానే మిగుల్చుతూ ఆట‌ను కొన‌సాగిస్తున్నాడు.

ఇక సీజ‌న్ అనంత‌రం కూడా ధోని ఐపీఎల్ నుంచి రిటైర్‌మెంట్ అవుతాడ‌ని గుస‌గుస‌లు మ‌ళ్లీ మొద‌లు అయ్యాయి. తాజాగా వీటిపై మ‌హేంద్రుడే స్పందించాడు. ఆ వార్త‌ల‌ను కొట్టి పారేశాడు. ఇప్ప‌ట్లో ఆట‌కు వీడ్కోలు ప‌లికే ఉద్దేశ్యం లేద‌న్నాడు. తాను వీర్ ఛైర్‌లో ఉన్నా స‌రే ఫ్రాంచైజీ త‌న‌ను లాక్కెళ్లిపోతుంద‌ని చెప్పుకొచ్చాడు.

Sunrisers Hyderabad anthem : సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌ యాంథ‌మ్‌ రిలీజ్.. ‘ఆరెంజ్ ఆర్మీ.. ఆటే సునామీ.. చెప్పి మ‌రీ తాట తీస్తామో..’

జియో హాట్‌స్టార్‌తో ధోని మాట్లాడుతూ.. ‘సీఎస్‌కే నా ఫ్రాంచైజీ. మ‌రికొంత కాలం పాటు ఆడాల‌ని అనుకుంటున్నాను. నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా స‌రే న‌న్ను లాక్కెళ్లిపోతారు.’ అని ధోని అన్నాడు.

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో మోకాలి గాయంతో ధోని చాలా ఇబ్బంది ప‌డ్డాడు. ఆ సీజ‌న్ ముగిసిన వెంట‌నే మోకాలి గాయానికి శ‌స్త్ర‌చికిత్స చేయించుక‌న్నాడు. గ‌తేడాది ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగి బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. 14 మ్యాచ్‌ల్లో 73 బంతుల‌ను ఎదుర్కొన్న ధోని 220 కి పైగా స్ట్రైక్‌రేట్తో 161 ప‌రుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 13 సిక్స‌ర్లు ఉన్నాయి.

19 ప‌రుగుల దూరంలో..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ (మార్చి23) ఆదివారం త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ధోని 19 ప‌రుగులు సాధిస్తే.. సీఎస్‌కే త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కుతాడు. ఈ క్ర‌మంలో అత‌డు సురేశ్ రైనాను అధిగ‌మిస్తాడు.

KKR vs RCB : కెప్టెన్‌గా తొలి విజ‌యం.. ర‌జ‌త్ కామెంట్స్ వైర‌ల్‌.. కోహ్లీ, ఫిల్‌సాల్ట్ కాదు.. ఆ ఇద్ద‌రి వ‌ల్లే గెలిచాం..

76 మ్యాచ్‌ల్లో 4687 ప‌రుగులు చేశాడు. ధోని 234 మ్యాచ్‌ల్లో 4669 ప‌రుగులు సాధించాడు. వీరిద్ద‌రి త‌రువాత ఈ జాబితాలో డుప్లెసిస్‌, రుతురాజ్ గైక్వాడ్‌లు ఉన్నారు.

ఐపీఎల్‌లో సీఎస్‌కే త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

* సురేశ్ రైనా – 4687 ప‌రుగులు
* ఎంఎస్ ధోని – 4669 ప‌రుగులు
* ఫాఫ్ డుప్లెసిస్ – 2721 ప‌రుగులు
* రుతురాజ్ గైక్వాడ్ -2380 ప‌రుగులు
* అంబ‌టి రాయుడు – 1932 ప‌రుగులు