ప్రపంచ కప్‌కు ముందు చెలరేగిపోతున్న రోహిత్ శర్మ

ప్రపంచ కప్ జట్టులో దేశం తరపున ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. ఇదే తపనలో కనిపిస్తున్నారు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో తమ సత్తా చాటుతూ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకునేందుకు తామేం తక్కువకాదని నిరూపించుకుంటున్నారు.

ప్రపంచ కప్‌కు ముందు చెలరేగిపోతున్న రోహిత్ శర్మ

Updated On : June 19, 2021 / 5:44 PM IST

ప్రపంచ కప్ జట్టులో దేశం తరపున ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. ఇదే తపనలో కనిపిస్తున్నారు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో తమ సత్తా చాటుతూ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకునేందుకు తామేం తక్కువకాదని నిరూపించుకుంటున్నారు.

ప్రపంచ కప్ జట్టులో దేశం తరపున ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కల. ఇదే తపనలో కనిపిస్తున్నారు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో తమ సత్తా చాటుతూ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకునేందుకు తామేం తక్కువకాదని నిరూపించుకుంటున్నారు. కొద్ది రోజుల ముందు మొదలైన వన్డే ఫార్మాట్‌లో సత్తా చాటిన షమీ వంద వన్డే వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు.

తొలి వన్డేలోనూ దూకుడైన ఆటతీరు కనబరిచిన రోహిత్.. రెండో వన్డేలోనూ అదే తరహాలో చెలరేగిపోయాడు. మూడేళ్లుగా టాపార్డర్‌లో కొనసాగుతున్న రోహిత్.. ధావన్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని అందిస్తున్నాడు. 2016 సంవత్సరం నుంచి వ్యక్తిగత రికార్డులను పరిశీలిస్తే.. కోహ్లీ 16 సెంచరీల సాయంతో 3599 పరుగుల చేశాడు. ఆ తర్వాత మళ్లీ అత్యధిక స్కోరుతో కొనసాగుతోంది రోహిత్ శర్మ 3083 పరుగులతో మాత్రమే. శిఖర్ ధావన్ మాత్రం 2274 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

చేధనకు దిగిన భారత జట్టులో రోహిత్, కోహ్లీలు ఉన్నారంటే ఊపిరిపీల్చుకునేంతలా జట్టుకు దన్నుగా నిలుస్తున్నారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సత్తా చాటుతున్న రోహిత్.. భారత్ తర్వాత ఆస్ట్రేలియాలోనే మళ్లీ అంతటి దూకుడు చూపించాడు. ప్రస్తుతం జరుగుతోన్న న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ చక్కటి స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. శనివారం మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలో తొమ్మిది ఫోర్ బౌండరీల సాయంతో 87 పరుగులు చేశాడు. కివీస్ ముంగిట భారీ టార్గెట్ నిలిచేందుకు దోహదపడ్డాడు.