Ind Vs WI : సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం… విండీస్ ముందు భారీ లక్ష్యం

వెస్టిండీస్ తో మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం చేశారు.

Ind Vs WI : సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం… విండీస్ ముందు భారీ లక్ష్యం

Ind Vs Wi

Updated On : February 20, 2022 / 11:26 PM IST

Ind Vs WI : వెస్టిండీస్ తో ఆఖరి, మూడో టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత జట్టులో యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ వీరవిహారం చేశారు. విండీస్ బౌలింగ్ ను ఓ ఆట ఆడుకున్నారు.

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ ఎవరంటే? టెస్ట్ జట్టు ఇదే!

ముఖ్యంగా సూర్యకుమార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 31 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 1 ఫోర్, 7 సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివరి బంతికి యాదవ్ ఔటయ్యాడు. భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు వెంకటేశ్ అయ్యర్ కూడా చెలరేగిపోయాడు. 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Suryakumar Yadav

Suryakumar Yadav

చివరి 5 ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్‌, వెంకటేశ్ అయ్యర్‌ చెలరేగి ఆడారు. పరుగుల వరద పారించారు. డ్రెక్స్ వేసిన 16 ఓవర్‌లో సూర్య కుమార్‌ ఓ సిక్స్ బాదగా.. వెంకటేశ్‌ రెండు ఫోర్లు  కొట్టాడు. ఆ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. షెఫర్డ్‌ వేసిన తర్వాత ఓవర్‌లోనూ 17 పరుగులు వచ్చాయి. డ్రెక్స్ వేసిన 19 ఓవర్‌లో సూర్యకుమార్ సిక్స్ బాదగా.. వెంకటేశ్ అయ్యర్‌ మూడు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి మూడు సిక్సులు బాదాడు. చివరి 5 ఓవర్లలో 86 పరుగులు వచ్చాయి.

Ranji Trophy: ఇన్నింగ్స్‌కో సెంచరీ బాది ఘనత నమోదు చేసిన యశ్ ధుల్

అంతకుముందు, ఓపెనర్ ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ (4), కెప్టెన్ రోహిత్ శర్మ (7) నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, షెపర్డ్, రోస్టన్ చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ తీశారు. ఇప్పటికే రెండు టీ20లు ఓడిన విండీస్.. సిరీస్ ను టీమిండియాకు చేజార్చుకుంది.

India Won

India Won