Kapil Dev Kidnap : క‌పిల్ దేవ్ కిడ్నాప్ వెనుక అస‌లు క‌థ ఇదే.. ప్రమోషన్ అదిరిపోయిందిగా..!

టీమ్ఇండియాకు మొట్ట మొద‌టి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించిన మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ (Kapi Dev) ను కిడ్నాప్ చేస్తున్న ఓ వీడియో సోమ‌వారం వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

Kapil Dev Kidnap : క‌పిల్ దేవ్ కిడ్నాప్ వెనుక అస‌లు క‌థ ఇదే.. ప్రమోషన్ అదిరిపోయిందిగా..!

Kapil Dev Kidnap

Kapil Dev : టీమ్ఇండియాకు మొట్ట మొద‌టి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించిన మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ (Kapi Dev) ను కిడ్నాప్ చేస్తున్న ఓ వీడియో సోమ‌వారం వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. క‌పిల్‌దేవ్‌ను ఎవ‌రు కిడ్నాప్ చేశారు..? ఆయ‌న క్షేమంగానే ఉన్నారా..? అంటూ అభిమానుల‌తో పాటు మాజీ క్రికెట‌ర్, ఎంపీ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీనిపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ వ‌చ్చింది.

అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI world cup ) జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పై డిస్నీ+హాట్‌స్టార్ (Disney+ Hotstar) స్ట్రీమింగ్ చేయ‌నుంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా డిస్నీ+హాట్‌స్టార్ ఈ వీడియోను క్రియేట్ చేసింది. ఈ వీడియోలో ఏం ఉందంటే..? కొంద‌రు క‌పిల్ దేవ్‌ను కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో బంధిస్తారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆయ‌న్ను విడిపించ‌డానికి అక్క‌డ‌కు వెళ‌తారు.

క‌పిల్ దేవ్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పాల‌ని అడుగుతారు. ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో క‌రెంట్ కోత‌లు ఉండొద్ద‌ని, ఆ మేర‌కు ఆహామీ ఇవ్వాల‌ని అన‌గా.. డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్‌లో ఫ్రీగా మ్యాచ్‌ల‌ను స్ట్రీమింగ్ చేస్తుంటే క‌రెంట్‌తో ప‌నేముంటుంద‌ని పోలీసులు చెబుతారు. మ‌రీ డేటా ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతుంది గ‌దా అని అడ‌గ‌గా.. డేటా సేవింగ్ మోడ్‌లో కూడా మ్యాచులు చూడొచ్చున‌ని చెబుతారు. దీంతో కపిల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ తాళ్లు విప్పుతారు. దీంతో కిడ్నాప్ క‌థ సుఖాంతం అవుతుంది.

IND vs AUS : మూడో వ‌న్డేకు ముందు రోహిత్ శ‌ర్మ ఆందోళ‌న‌.. అందుబాటులో 13 మంది మాత్ర‌మే..

అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 10 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. 10 వేదిక‌ల్లో 48 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మెగా టోర్నీకి స‌న్న‌ద్దం కావ‌డానికి ప్ర‌తి జ‌ట్టు రెండు వార్మ‌ప్ మ్యాచులు ఆడ‌నుంది. ఈ మ్యాచుల‌ను మొబైల్‌లో డిస్ని+హాట్ స్టార్ లో ఫ్రీగా చూడొచ్చు. ఈ సారి భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి 12 ఏళ్ల నిరీక్ష‌ణ‌ను తెర‌దించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.