IND vs BAN: వారిపై ఫిర్యాదులు చేయను..! బంగ్లాతో మ్యాచ్ తరువాత వరుణ్ చక్రవర్తి ఎమోషనల్ స్పీచ్..
మూడేళ్ల తరువాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లు పడగొట్టాడు.

varun chakravarthy
varun chakravarthy: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 19.5 ఓవర్లకు 127 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. బంగ్లా బ్యాటర్లను ఎక్కువసేపు క్రీజులో కుదురుకోకుండా పెవిలియన్ బాట పట్టించారు. ముఖ్యంగా దాదాపు మూడేళ్ల తరువాత అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read : IND vs BAN: తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి పేరుమార్చుకున్నారా.. బీసీసీఐ తప్పు చేసిందా?
సుదీర్ఘకాలం తరువాత తాను తిరిగి అంతర్జాతీయ జట్టులో చేరడం పునర్జన్మలా భావిస్తున్నా.. మళ్లీ బ్లూ జెర్సీని ధరించడం ఆనందంగా ఉందని వరుణ్ చక్రవర్తి భావోద్వేగానికి గురయ్యాడు. చివరి సారిగా నేను 2021లో జాతీయ జట్టుకు ఆడా. ఆ తరువాత ఎక్కువగా ఐపీఎల్ టోర్నీలో, తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ కొన్ని మ్యాచ్ లు ఆడానని చెప్పాడు. ఎప్పటికప్పుడు నా ఆటతీరును మెరుగుపర్చుకుంటూనే ఉన్నా. అశ్విన్ తో కలిసి ఆడటం కూడా నాకు కలిసొచ్చిందని వరుణ్ చక్రవర్తి అన్నారు. గతంలో ఏం జరిగిందనే విషయం గురించి నేను అస్సలు ఆలోచించను. ప్రస్తుతం ఏం చేయగలం అనే దానిపై నా దృష్టి ఉందని చెప్పాడు.
Also Read : CM Yogi Adityanath : గ్రౌండ్‌లోకి దిగి బ్యాట్‌పట్టిన యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్.. వీడియో వైరల్
మ్యాచ్ లో పలువురు టీమిండియా ప్లేయర్స్ సులభమైన క్యాచ్ లను వదిలేయడంపై వరుణ్ చక్రవర్తి స్పందించారు. నా తొలి ఓవర్ లోనే క్యాచ్ డ్రాప్ అయింది. ఇలాంటి వాటిపై నేనేమీ ఫిర్యాదులు చేయను. క్రికెట్ లో ఇలాంటివి మామూలే.. మున్ముందూ ఇలానే నాణ్యమైన బౌలింగ్ తో కొనసాగుతా అంటూ వరణ్ చక్రవర్తి వెల్లడించారు.