Virat Kohli: అదే నా వీక్‌నెస్‌ అంటూ భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కోహ్లి ఆసక్తికర కామెంట్స్‌

క్రీజులో షాట్ల కోసం చేసిన ప్రయత్నాల్లో కోహ్లి తరుచూ స్లిప్‌లో క్యాచ్‌ ఇస్తూ సమస్యలు ఎదుర్కొన్నాడు.

Virat Kohli: అదే నా వీక్‌నెస్‌ అంటూ భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కోహ్లి ఆసక్తికర కామెంట్స్‌

Virat Kohli

Updated On : February 25, 2025 / 7:48 AM IST

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా బ్యాటర్ విరాట్‌ కోహ్లి సెంచరీ చేయడంపై మరోసారి స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది.

క్రీజులో షాట్ల కోసం చేసిన ప్రయత్నాల్లో కోహ్లి తరుచూ స్లిప్‌లో క్యాచ్‌ ఇస్తూ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇది తనకు సమస్యాత్మక పరిస్థితి అని కోహ్లి అన్నాడు. ఇప్పుడు కాదని, కొన్నేళ్ల నుంచి తనకు కవర్‌ డ్రైవ్‌ వీక్‌నెస్‌గా మారిందని చెప్పాడు.

అయినప్పటికీ ఆ షాట్‌తో తాను బాగా రన్స్‌ చేసినట్లు విరాట్ కోహ్లి తెలిపాడు. తన షాట్లపై విశ్వాసం ఉంచానని, దీంతో తన తొలి రెండు బౌండరీలు ఆ షాట్ల ద్వారానే వచ్చినట్లు చెప్పాడు.

అటువంటి షాట్ల వల్ల బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కంట్రోల్‌లోనే ఉన్నట్లు అనిపిస్తుందని విరాట్ కోహ్లి తెలిపాడు. పర్సనల్‌గా తనకు ఇది గొప్ప ఇన్నింగ్స్‌ అని, అలాగే, టీమిండియాకు మంచి గెలుపు దక్కిందని చెప్పాడు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతుందో తెలుసా? నేటి పసిడి ధరలు ఇలా..

భారత్‌- పాకిస్థాన్ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో టీమిండియా ధాటిగా ఆడి 42.3 ఓవర్లలో 244/4 పరుగులు చేసి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచును బంగ్లాదేశ్‌తో ఈ నెల 27న ఆడుతుంది. ఇండియా తన తదుపరి మ్యాచును న్యూజిలాండ్‌తో మార్చి 2న ఆడనుంది.

రిజ్వాన్ కెప్టెన్సీలోని పాకిస్థాన్‌ జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. న్యూజిలాండ్ ఆ మ్యాచులో 321 పరుగులు చేయగా, పాకిస్థాన్ కేవలం 260 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 60 పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది. పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్‌లో చేరే అవకాశాలను దూరం చేసుకుంది.