Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే ఇండియన్ విరాట్ కోహ్లీ.. ఒక్క పోస్ట్‌కు ఎంతో తెలుసా?
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు.
![Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే ఇండియన్ విరాట్ కోహ్లీ.. ఒక్క పోస్ట్‌కు ఎంతో తెలుసా? Virat Kohli : ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే ఇండియన్ విరాట్ కోహ్లీ.. ఒక్క పోస్ట్‌కు ఎంతో తెలుసా?](https://10tv.in/wp-content/uploads/2023/08/Virat-Kohli.jpg)
Virat Kohli
Virat Kohli Instagram : విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే క్రికెట్ అభిమానుల్లో పూనకాలు వచ్చినట్లే. విరాట్ క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. ప్రపంచ టాప్ బ్యాటర్లలో ఒకడిగా పేరు గడించిన కోహ్లీకి అభిమానులు ఎక్కువే. నిత్యం ఫొటోలు, వీడియో క్లిప్‌లు షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు కోహ్లీ అందుబాటులో ఉంటాడు. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫాలోవర్స్ 256 మిలియన్ల మందికిపైగానే ఉన్నారు. తాజాగా ఓ నివేదిక ఇన్ స్టాగ్రామ్‌లో గ్లోబల్ సూపర్స్టార్ల ఆదాయాల జాబితాలను విడుదల చేసింది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఇండియాలో అగ్రస్థానంలో నిలిచాడు.
Rohit Sharma: జడేజాకూడా ఆడటం లేదు.. అతని గురించి అడగరేం? కోహ్లీ గురించి ప్రశ్నించగా రోహిత్ రియాక్షన్
ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదించే వ్యక్తుల 2023 జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ 20లో చేరాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ ఒక్క పోస్టు పెడితే రూ.11.45 కోట్లు తీసుకుంటాడట. తద్వారా ఈ జాబితాలో ఇండియాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు. రోనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్టు పెడితే రూ.26.75 కోట్లు వస్తాయట. రెండో స్థానంలో లియోనెల్ మెస్సి నిలిచాడు. మెస్సీ ఇన్‌స్టాలో ఒక్క పోస్టు పెడితే 21.49 కోట్లు వస్తాయి.
Virat Kohli : కోహ్లి ఏ ఇయర్ బడ్స్ వాడుతాడో తెలుసా..? మన దగ్గర దొరకవు.. ధర ఎంతంటే..?
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదించే వారి జాబితాలో భారత్ దేశంలో విరాట్ కోహ్లీ తరువాత బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 29 స్థానంలో ఉన్న ప్రియాంక.. ఒక్కపోస్టు ద్వారా రూ.4.40 కోట్లు వస్తాయట. అయితే తాజాగా విడుదలైన జాబితాలో తొలి రెండు స్థానాల్లో క్రీడాకారులు ఉండటం గమనార్హం.