Virat Kohli : టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్న క్రీడాకారుల్లో కోహ్లీ ఒకడు.

Virat Kohli Net Worth What Is Kohli Wealth
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ పార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో భావోద్వేగభరిత పోస్ట్‌ను పెట్టాడు. రోహిత్, కోహ్లీ నిష్ర్కమణతో టెస్టు క్రికెట్‌లో ఓ శకం ముగిసినట్లైంది.
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్న క్రీడాకారుల్లో కోహ్లీ ఒకడు. అతడి నికర ఆస్తులు వెయ్యి కోట్లకు పైనే ఉంటుందట. స్టాక్ గ్రో అనే కంపెనీ గణాంకాల ప్రకారం కోహ్లీ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు.
కోహ్లీ సంపాదన ఇలా..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కోహ్లీ A+ గ్రేడ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ నుంచి ఏటా అతడికి రూ.7 కోట్లు జీతంగా అందుకుంది. ఇది కాకుండా మ్యాచ్ ఫీజులు అదనం. ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డేలకు రూ.6లక్షలు, టీ20లకు రూ.3లక్షలు చొప్పున పొందుతాడు.
ఐపీఎల్ నుంచి అతడు పెద్ద మొత్తంలో సంపాదించాడు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 ఏడాది నుంచి ఇప్పటి వరకు అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపుననే ఆడుతున్నాడు. 2008లో అతడు రూ.12లక్షలు అందుకోగా 2018 నుంచి 2021 మధ్యలో రికార్డు స్థాయిలో 17 కోట్లను అందుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా రూ.21 కోట్లు అందుకోనున్నాడు. మొత్తంగా ఐపీఎల్ నుంచి 212.44 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
బ్రాండ్ కింగ్..
సొంతంగా కోహ్లీకి చాలా బ్రాండ్లు ఉన్నాయి. బ్లూట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఎంపీఎల్, స్పోర్ట్స్ కాన్వో లాంటి ఏడు స్టార్టప్స్‌లో అతడు పెట్టుబడి పెట్టాడు. ఇక 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఒక్కొ యాడ్‌లో నటించేందుకు అతడు రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తావడు. ఇలా యాడ్స్ ద్వారానే అతడు రూ.175 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక సోషల్ మీడియా ద్వారా గట్టిగానే సంపాదిస్తున్నాడు.
IPL 2025 : మే 16 నుంచే ఐపీఎల్..! నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లు..!
ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు రూ.8.9 కోట్లు, ట్విటర్‌లో ఒక్కో పోస్టుకు రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ముంబైలో కోహ్లీకి రూ.34 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. గురుగ్రామ్‌లో రూ.80 కోట్లు విలువ చేసే మరో నివాసం ఉంది. రూ.31కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి.
అంతేకాదండోయ్.. కోహ్లీకి ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ క్లబ్, ఓ టెన్నిస్ జట్టు, ప్రో రెజ్లింగ్ జట్లు ఉన్నాయి.