స్మిత్‌ను పక్కకుబెట్టిన కోహ్లీ

స్మిత్‌ను పక్కకుబెట్టిన కోహ్లీ

Updated On : December 8, 2019 / 6:01 AM IST

విరాట్ కోహ్లీ టెస్టుల్లోనూ నెం.1 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. నిషేదం పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన స్మిత్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతో కోహ్లీ నెం.2కు పడిపోయాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకుల్లో కోహ్లీ 928పాయింట్లతో టాప్ కు చేరిపోయాడు. స్మిత్ 923పాయింట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు. 

స్మిత్ ఇటీవల ఆడిన రెండు టెస్టుల్లోనూ హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడమే దీనికి కారణం. పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ లలో ఆసీస్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఇద్దరూ భారత బ్యాట్స్ మన్లు పూజారా, రహానెలు నాలుగు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

బౌలర్లలో 900పాయింట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ తొలి స్థానాన్ని దక్కించుకోగా, తర్వాత దక్షిణాఫ్రికా ఫేసర్ కగిసో రబాడ 839పాయింట్లతో నిలిచాడు. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ పేలవ ప్రదర్శనకు మూడో స్థానానికి దిగజారాడు. 

ఆల్ రౌండర్లు టాప్ 5స్థానాలను స్థిరపరుచుకున్నారు. జాసన్ హోల్డర్, రవీంద్ర జడేజా మొదటి రెండు స్థానాల్లో చేరుకోగా రవి చంద్రన్ అశ్విన్ టాప్ 5గా నిలిచాడు. బెన్ స్టోక్స్ పొజిషన్ టాప్ 3గా ఉంది.