షాకింగ్ : కోహ్లీ ఇండియాకి.. రోహిత్ కు కెప్టెన్సీ

న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే చివరి రెండు వన్డేలు, టీ20ఐ సిరీస్ లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.

  • Published By: sreehari ,Published On : January 23, 2019 / 01:30 PM IST
షాకింగ్ : కోహ్లీ ఇండియాకి.. రోహిత్ కు కెప్టెన్సీ

Updated On : January 23, 2019 / 1:30 PM IST

న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే చివరి రెండు వన్డేలు, టీ20ఐ సిరీస్ లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.

న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే చివరి రెండు వన్డేలు, టీ20ఐ సిరీస్ లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. కోహ్లీ స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు. గత ఏడాదిలో రోహిత్ కెప్టెన్సీలో ఇండియా ఆసియా కప్ టైటిల్ గెలిచింది. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో అతడి స్థానంలో రోహిత్ కు మరోసారి కెప్టెన్సీ అవకాశం వచ్చింది. ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో భారత క్రికెటర్లపై పనిభారం తగ్గించాలని సెలెక్టర్లు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లకు అన్ని ఫార్మాట్లలో జస్ ప్రీత్ బుమ్రా సహా మరో ఆటగాడికి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. గత కొన్నినెలలుగా వరుస మ్యాచ్ లతో వర్క్ లోడ్ పెరిగి టీమిండియా క్రికెటర్లు సతమతం అవుతున్నారు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో హోం సిరీస్ జరుగనుంది. దీని దృష్ట్యా టీమ్ మేనేజ్ మెంట్, సీనియర్ సెలక్షన్ కమిటీ టీమిండియా క్రికెటర్లకు తప్పనిసరి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓ నివేదిక పేర్కొంది. న్యూజిలాండ్ జట్టుతో తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.