Champions Trophy: టీమిండియా విజయం తరువాత రోహిత్, కోహ్లీ, జడేజా ఏం చేశారో చూశారా.. వీడియోలు వైరల్.. ఫ్యాన్స్ ఖుషీ
ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫైనల్లో గెలిచిన తరువాత..

Virat Kohli Rohit sharma
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ జట్టు నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా టీమిండియా 12ఏళ్ల విరామం తరువాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలో కోలాటం ఆడుతూ సందడి చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ లో విజయం తరువాత టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫైనల్లో గెలిచాక వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నారు. ఒకరినొకరు హత్తుకుంటూ స్టేడియంలో అభిమానులకు అభివాదం చేశారు. వికెట్లు తీసుకొని కోలాటం ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక కోహ్లీ చేసిన గంగ్నమ్ నృత్యాన్ని గుర్తుకు తెస్తూ అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాతో కలిసి జడేజా అదే డ్యాన్స్ చేశాడు.
Wholesome celebration by Virat and Rohit ❤️#INDvsNZ #ICCChampionsTrophypic.twitter.com/O3WES22XGB
— PRAFUL (@BeingPrafulK) March 9, 2025
virat kohli and rohit sharma playing dandiya after winning champions trophy was not in my 2025 bucket list 😭 pic.twitter.com/dZsRRCU8Mt
— saif (@nightchanges) March 9, 2025
One Team
One Dream
One Emotion!🇮🇳🇮🇳🇮🇳#TeamIndia pic.twitter.com/MbqZi9VGoG
— BCCI (@BCCI) March 9, 2025