ఇంజమామ్‌ను దాటేసిన కోహ్లీ
టెస్టు సెంచరీలు చేసిన భారత ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్(36 సెంచరీలు), సునీల్ గవాస్కర్(34 సెంచరీలు) ఉన్నారు.

టెస్టు సెంచరీలు చేసిన భారత ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్(36 సెంచరీలు), సునీల్ గవాస్కర్(34 సెంచరీలు) ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడుతోన్న మ్యాచ్ లో భారత్ విజృంభిస్తోంది. కెప్టెన్ కోహ్లీ క్రీజులో ఉండగా భారీ స్కోరు దిశగా ఆడుగులేస్తుంది. ఓవర్ నైట్ స్కోరు 273/3తో మ్యాచ్ ఆరంభించిన రహానె, కోహ్లీలు హాఫ్ సెంచరీ, సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో కోహ్లీ తన 26వ సెంచరీ నమోదు చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా ఫేసర్ వెర్నాన్ ఫిలాండర్ వేసిన బంతిని బౌండరీకి పంపి 26వ సెంచరీ నమోదు చేసుకన్నాడు. ఇంజమామ్ 120టెస్టుల్లో 200 ఇన్నింగ్స్‌లు ఆడి 25 టెస్టు సెంచరీలు నమోదు చేయగలిగాడు. అంతకంటే వేగంగా 81టెస్టులాడి 138ఇన్నింగ్స్‌లలోనే 26వ టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. 26టెస్టు సెంచరీలు బాదేసి ఎక్కువ శతకాలు బాదిన అంతర్జాతీయ క్రికెటర్‌గా వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్, ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ ల జాబితాలోకి చేరిపోయాడు కోహ్లీ.
ఈ జాబితాలో ఇంకా టాప్ లోనే నిలిచాడు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. 200టెస్టులు ఆడి 329ఇన్నింగ్స్ లలో 51సెంచరీలు నమోదు చేసి టాప్ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా పరుగులు చేస్తున్న కోహ్లీ టెస్టుల్లో 53వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు సెంచరీలు చేసిన భారత ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్(36 సెంచరీలు), సునీల్ గవాస్కర్(34 సెంచరీలు) ఉన్నారు.
1️⃣0️⃣0️⃣ *
? 26th Test century
? 69th international century
? 12th Test century in IndiaVirat Kohli ??
Follow #INDvSA LIVE ▶️ https://t.co/MO1tirNpXK pic.twitter.com/SJjBXizM19
— ICC (@ICC) October 11, 2019