IND vs PAK : పాక్ పై అద్భుత ఇన్నింగ్స్.. విరాట్ కోహ్లీ పై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం.. ఇలా చేస్తావని అనుకోలేదు..
పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ చేసిన ఓ పనికి దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.

Virat Kohli Survives Obstructing The Field Dismissal Leaves Sunil Gavaskar Angry
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ దాదాపుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. అటు పాకిస్తాన్ ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్ర్కమించినట్లే. దాయాది పై విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. వన్డేల్లో అతడికి 51వ సెంచరీ.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 111 బంతులను ఎదుర్కొన్నాడు. 7 ఫోర్ల సాయంతో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒంటి చేత్తో భారత్‌కు విజయాన్ని అందించిన కోహ్లీ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం కోహ్లీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే.. వార్నీ ఒకే మ్యాచ్‌లో ఇన్నా..
పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ చేసిన ఓ పనినే అందుకు కారణం. పాక్ ఫీల్డర్ విసిరిన ఓ త్రోను కోహ్లీ తన చేతితో సరదాగా ఆపడానికి యత్నించాడు. దీనిపైనే గవాస్కర్ మండిపడ్డాడు. ఒకవేళ ఆ సమయంలో పాక్ ఫీల్డర్ అప్పీల్ చేసి ఉంటే కోహ్లీని ‘Obstructing The Field’ కింద అంపైర్లు కోహ్లీ ఔట్ గా ప్రకటించేవారు.
భారత ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. కోహ్లీ ఓ షాట్ కొట్టి సింగిల్ కోసం పరిగెత్తాడు. అదే సమయంలో బంతిని ఆపిన ఫీల్డర్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపుగా త్రో వేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న కోహ్లీ సరదాగా ఆ త్రోను ఆపాలని ప్రయత్నించాడు. అప్పటికి కోహ్లీ 52 బంతుల్లో 43 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు.
ఆ సమయంలో కామెంట్రీ బాక్స్ ఉన్న సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. విరాట్ ఇలా చేసి ఉండాల్సింది కాదన్నాడు. కోహ్లీ బంతిని తాకకపోయి ఉంటే.. వెనుక నిలబడి ఉన్న పాకిస్తాన్ ఆటగాడు మిస్‌ఫీల్డింగ్ చేసి ఉండేవాడని, టీమ్ ఇండియాకు ఓ అదనపు వచ్చే అవకాశం ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు అప్పీల్ చేసి ఉంటే.. విరాట్ కోహ్లీ ‘Obstructing The Field’ కింద ఔట్ అయ్యేవాడని చెప్పుకొచ్చాడు.
కాగా.. గతంలో పలు సందర్భాల్లో బ్యాటర్లు బంతిని ఆపి ఔటైన సందర్భాలు ఉన్నాయి. భారత్‌తో జరిగిన ఓ మ్యాచ్ పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు ఇంజామాముల్ హక్ ఇలానే ఔట్ అయిన సంగతి తెలిసిందే.
#INDvPAK
Virat kohli have started fielding for pakistan, it’s getting boring for him. pic.twitter.com/tzo6Arx5Qq— Kshitij Sharma (@kshx_76) February 23, 2025