IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టిన రికార్డులు ఇవే.. వార్నీ ఒకే మ్యాచ్‌లో ఇన్నా..

పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ప‌లు రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

IND vs PAK : పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టిన రికార్డులు ఇవే.. వార్నీ ఒకే మ్యాచ్‌లో ఇన్నా..

IND vs PAK, Virat Kohli, Champions Trophy 2025, Virat Kohli records, Team India

Updated On : February 24, 2025 / 9:47 AM IST

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చెల‌రేగి ఆడాడు. అజేయ శ‌త‌కంతో జ‌ట్టుకు ఒంటి చేత్తో విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మొత్తంగా 111 బంతులు ఎదుర్కొన్నాడు 7 ఫోర్ల సాయంతో 100 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను కోహ్లీ బ‌ద్ద‌లు కొట్టాడు.

అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు..

కీల‌క ఇన్నింగ్స్ ఆడిన‌ కోహ్లీకి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. ఐసీసీ ఈవెంట్ల‌లో ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆట‌గాడిగా కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. పాక్ పై 5 సార్లు కోహ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను అందుకున్నాడు. 2012 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2025 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ల‌లో పాక్ పై ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు. మ‌రే ప్లేయ‌ర్ కూడా ఒకే జ‌ట్టుపై మూడు లేదా అంత‌కంటే ఎక్కువ అవార్డులు సాధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

IND vs PAK : ఓటమికి సాకులు చెప్పిన రిజ్వాన్.. గెలిచే వాళ్ల‌మే కానీ..

వ‌న్డేల్లో ఫాస్టెస్ట్ 14 వేల ర‌న్స్‌..

ఈ మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 15 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ వ‌న్డేల్లో 14 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 14 000 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేశాడు. స‌చిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా కోహ్లీ కేవ‌లం 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు.

3వ స్థానంలో..
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి )అత్య‌ధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ (27,483ప‌రుగులు)ను అధిగ‌మించాడు. కోహ్లీ ఖాతాలో ప్ర‌స్తుతం 27, 503 ప‌రుగులు ఉన్నాయి. ఈ జాబితాలో 34,357 ప‌రుగుల‌తో స‌చిన్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. ఆ త‌రువాత సంగ‌క్క‌ర 28,016 ప‌రుగుల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

IND vs PAK : పాక్ పై ఘ‌న విజ‌యం.. బౌల‌ర్లకు క్రెడిట్‌ ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. కోహ్లీ శ‌త‌కం పై ఏమ‌న్నాడంటే?

82వ సెంచ‌రీ..
పాక్ పై తాజా సెంచ‌రీ విరాట్ కోహ్లీకి వ‌న్డేల్లో 51వ శ‌త‌కం. కాగా.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో(మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి) 82వ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన రికార్డు స‌చిన్ పేరిట ఉంది. స‌చిన్ 100 శ‌త‌కాలు చేశాడు. ఈ జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడు.

1వ‌ది..
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఇది తొలి సెంచ‌రీ. ఈ ఇన్నింగ్స్‌కు ముందు అత‌డు ఐదు అర్థ‌శ‌త‌కాల‌తో 551 ప‌రుగులు చేశాడు.

పాక్ పై ఏకైక బ్యాట‌ర్‌..


తాజా సెంచ‌రీతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, ఛాంపియ‌న్స్ ట్రోఫీ, ఆసియా క‌ప్‌ల‌లో పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు.

Virat Kohli : పాక్ పై అద్భుత ఇన్నింగ్స్.. కోహ్లీ కామెంట్స్ వైర‌ల్‌.. అందుకే నంబ‌ర్ వ‌న్‌.. రోహిత్ ఔటైనా..

అత్య‌ధిక క్యాచ్‌లు..
వ‌న్డేల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త ఫీల్డ‌ర్‌గా కోహ్లీ రికార్డుల‌కు ఎక్కాడు. పాక్‌తో మ్యాచ్‌లో న‌సీమ్ షా క్యాచ్ అందుకున్న క్ర‌మంలో విరాట్ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేశాడు. 334 వ‌న్డేల్లో అజారుద్దీన్ 156 క్యాచ్‌లు అందుకోగా, 299 మ్యాచ్‌ల్లోనే కోహ్లీ 157 క్యాచ్‌లు అందుకోవ‌డం విశేషం.