Virat Kohli : విజయం తరువాత పెద్దామె కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ.. ఆమె ఎవరో తెలుసా? వీడియో వైరల్
భారత్ విజయానంతరం విరాట్ కోహ్లీ ఓ మహిళ కాళ్లు మొక్కి ఆశ్వీర్వాదం తీసుకున్నాడు.

Virat Kohli Touches The Feet Of Mohammed Shami Mother
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడు. ఇక తన తోటి ఆటగాళ్లతో కోహ్లీ ఎంతో సరదాగా ఉంటాడు అన్న సంగతి తెలిసిందే. ఇక పెద్ద వాళ్లు కలిస్తే ఎంతో వినయంగా ఉంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీ2025లో భారత్ విజయానంతరం ఓ మహిళ కాళ్లు మొక్కి,
ఆశ్వీర్వాదం తీసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ఆమె ఎవరు అని తెలుసుకోవాలని చాలా మంది ఆరాటపడుతున్నారు.
Here is the clip https://t.co/MBWpwfp45U pic.twitter.com/zHE3A8KTAR
— 🇳🇿 (@whyrattkuhli) March 9, 2025
ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ గెలవడంతో ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. ప్లేయర్ల కుటుంబ సభ్యులు సైతం మైదానంలోకి వచ్చి ఆటగాళ్ల వేడుకల్లో భాగం అయ్యారు. టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తల్లి కూడా మైదానంలోకి వచ్చారు.
మా అమ్మగారు అంటూ షమీ చెప్పగా కోహ్లీ వెంటనే ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. షమీ తల్లి కూడా కోహ్లీని ఎంతో ఆప్యాయంగా పలకరించింది. ఈ దృశ్యం అక్కడన్న వాళ్ల మనసులను తాకింది. ఈ వీడియో వైరల్‌గా మారగా.. పెద్దవాళ్లకి కోహ్లీ ఇచ్చే గౌరవం చూసి అంతా అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విఫలం అయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. అటు షమీ సైతం ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 9 ఓవర్లు వేసిన షమీ 74 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ పడగొట్టాడు.