Champions Trophy : అరెరె ఈ విషయాన్ని గమనించారా? భారత ఆటగాళ్లు వైట్ జాకెట్స్ ఎందుకు ధరించారు? దాని వెనుక ఉన్న కథేంటి ?
వైట్ జాకెట్స్ వేసుకుని ఆటగాళ్లు అందరూ ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్నారు

Why Team India wear white jackets aftter winning champions troph
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి 12 ఏళ్ల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడం గమనార్హం. దీంతో కోట్లాది మంది అభిమానులు ఆనందలో మునిగిపోయారు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకునేటప్పుడు భారత ఆటగాళ్లు అందరూ వైట్ జాకెట్స్‌ను ధరించి ఉన్నారు.
అసలు వైట్ జాకెట్స్ వేసుకుని ఆటగాళ్లు అందరూ ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్నారు? దీని వెనుక ఏం ఉంది అన్నది ఓ సారి చూద్దాం..
CHAMPIONS 🇮🇳🇮🇳#TeamIndia pic.twitter.com/5fjltfyBB6
— BCCI (@BCCI) March 9, 2025
ఈ వైట్ జాకెట్స్ ను ఐసీసీ అందజేస్తుంది. వీటిని ధరించే ఆటగాళ్లు కప్పును అందుకోవాల్సి ఉంటుంది. జెంటిమన్ క్రికెట్‌లో దర్పానికి, గౌరవానికి ప్రతీకగా ఐసీసీ ట్రోఫీతో పాటు జాకెట్లను అందజేస్తోంది. కేవలం వీటిని ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలకు మాత్రమే ఇస్తారు. మిగిలిన ఐసీసీ ఈవెంట్లలో ఇవ్వరు.
1998 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీకారం చుట్టినప్పటికి వైట్ జాకెట్స్ ఇచ్చే సంప్రదాయాన్ని ఐసీసీ 2009లో ప్రవేశపెట్టింది. అయితే.. ఇది సాధారణ వైట్ జాకెట్స్ మాత్రం కాదండోయ్. దీనిని అత్యంత ఖరీదైన ఇటాలియన్ నూలుతో తయారు చేస్తారు.
వినూత్నమైన టెక్చ్సర్, స్ట్రిప్‌లు, బంగారు వర్ణ ఎంబ్రాయిడింగ్ వర్క్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ లోగోతో ఆ జాకెట్లు ఉంటాయి. ఈ జాకెట్లను ముంబైకి చెందిన స్టైలిస్ట్ బబిత రూపొందించారు.
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ వైట్ జాకెట్స్ ను ఆటగాళ్లకు ప్రధానం చేశారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మొదటగా ఈ వైట్ జాకెట్స్‌ను తీసుకున్నారు. కాగా.. ఆటగాళ్లు అందరికి బిన్ని స్వయంగా ఈ జాకెట్స్‌ను తొడగడం విశేషం.
2013లో ధోని నాయకత్వంలో భారత్ ఛాంపియన్స ట్రోఫీ విజేతగా నిలిచింది. అప్పుడు ధోనితో మిగిలిన ఆటగాళ్లు అందరూ కూడా వైట్ జాకెట్స్ ధరించే ట్రోఫీని అందుకున్నారు.