Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. జస్‌ప్రీత్ బుమ్రా కామెంట్స్ వైరల్.. ఏమన్నాడో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచిన తరువాత బుమ్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Jasprit Bumrah reaction viral after India win Champions Trophy 2025
ముచ్చటగా మూడోసారి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
దాదాపు 12 సంవత్సరాల తరువాత టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈక్రమంలో సోషల్ మీడియా వేదికగా భారత జట్టు పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Played like true champions! Congratulations to the entire team on a wonderful tournament and a well deserved win! 🇮🇳🏆🙌 pic.twitter.com/cCkHGBFexf
— Jasprit Bumrah (@Jaspritbumrah93) March 9, 2025
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభానికి ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ సందర్భంగా టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు.
వెన్నుగాయంతో బాధపడుతున్న అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. దీంతో బుమ్రా లేకుండా టీమ్ఇండియా ఎలా ఆడుతుంది అన్న ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.
బుమ్రా స్థానంలో పేసర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నాడు. కాగా.. స్పిన్నర్లు అంచనాలను మించి రాణించడంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో టీమ్ఇండియా పై పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ‘నిజమైన ఛాంపియన్స్‌లా ఆడారు. టీమ్ఇండియాకు అభినందనలు. ఇదో అద్భుతమైన టోర్నమెంట్. ఈ విజయానికి మీరంతా అర్హులు.’ అంటూ బుమ్రా రాసుకొచ్చాడు. విరాట్ కోహ్లీ కప్పును పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.
బుమ్రా రాక మరింత ఆలస్యం..
వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా తిరిగి ఎప్పుడు క్రికెట్ ఆడుతాడు అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. ఐపీఎల్ నాటికి బుమ్రా కోలుకుంటాడని అంతా భావించారు. అయితే.. ఐపీఎల్‌లో మొదటి రెండు వారాలు మిస్ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టులో చేరతాడని అంటున్నారు.