Champions Trophy : ఛాంపియ‌న్స్ ట్రోఫీతో టీమ్ఇండియా క్రికెట‌ర్ల ఫోజులు చూశారా? ఒక్కొక్క‌రు ఒక్కొ ఐకానిక్ ఫోజ్‌..

ఛాంపియ‌న్స్ ట్రోఫీతో టీమ్ఇండియా క్రికెట‌ర్ల దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

Champions Trophy : ఛాంపియ‌న్స్ ట్రోఫీతో టీమ్ఇండియా క్రికెట‌ర్ల ఫోజులు చూశారా? ఒక్కొక్క‌రు ఒక్కొ ఐకానిక్ ఫోజ్‌..

Team India cricketers iconic pose with ICC Champions Trophy 2025 pics viral

Updated On : March 10, 2025 / 8:42 AM IST

ఆదివారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన పైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టును 4 వికెట్ల తేడాతో ఓడించి భార‌త్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 విజేత‌గా నిలిచింది. ఈ టోర్నీని గెల‌వ‌డం భార‌త్‌కు ఇది మూడోసారి. ఈ క్ర‌మంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీని అత్య‌ధిక సార్లు గెలిచిన జ‌ట్టుగా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. దాదాపు 12 సంత్స‌రాల త‌రువాత ఈ ట్రోఫీని గెల‌వ‌డంతో అభిమానుల‌తో పాటు భార‌త ఆట‌గాళ్ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 251 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (63), బ్రాస్‌వెల్ (53 నాటౌట్‌) లు అర్థ‌శ‌త‌కాలు సాధించారు. ర‌చిన్ ర‌వీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. భార‌త బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ర‌వీంద్ర జ‌డేజా, ష‌మీలు త‌లా ఓ వికెట్ సాధించారు.

Virat Kohli : ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా భార‌త్‌.. అత‌డిని అలా చూడ‌డం ఎంతో బాధ‌గా ఉంద‌న్న కోహ్లీ.. కుర్రాళ్ల చేతిలో మ‌రో 10 ఏళ్లు..

pic credit (Mufaddal Vohratwitter)

అనంత‌రం 252 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 49 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ (48), కేఎల్ రాహుల్ (34 నాటౌట్) లు రాణించారు. భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపిక అయ్యాడు.

Sunil Gavaskar : భార‌త జ‌ట్టు విజేత‌గా నిల‌వ‌గానే.. దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ ఏం చేశాడో చూశారా? వీడియో వైర‌ల్‌

pic credit (Mufaddal Vohra twitter)

ఛాంపియ‌న్స్ ట్రోఫీని గెలుచుకున్న త‌రువాత భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, రిష‌బ్ పంత్ ఇలా.. ఒక్కొక్క‌రు ఒక్కొ విధంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీతో ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి.

pic credit (Mufaddal Vohra twitter)

pic credit (Mufaddal Vohra twitter)

pic credit (ICC twitter)

pic credit (ICC twitter)

pic credit (ICC twitter)

pic credit (ICC twitter)

pic credit (ICC twitter)

Champions Trophy 2025 Prize Money : ల‌క్కంటే టీమ్ఇండియాదే.. భార‌త్‌ పై కోట్ల వ‌ర్షం.. ఏ జ‌ట్టుకు ఎంత ప్రైజ్‌మ‌నీ అంటే?

 

pic credit (ICC twitter)